64వ గోల్‌తో ఐఎస్‌ఎల్ టాప్ స్కోరర్‌గా సునీల్ ఛెత్రి
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. బెంగళూరు తరఫున ఎడ్గర్ మెండెజ్ (9వ ని.లో), సురేశ్ సింగ్ (20వ ని.లో), భారత మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి (51వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఐఎస్‌ఎల్ చరిత్రలో సునీల్ ఛెత్రికిది 64వ గోల్ కావడం విశేషం.
ఈ గోల్‌తో ఐఎస్‌ఎల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 63 గోల్స్‌తో బార్ట్ ఒగ్బెచె (నైజీరియా; హైదరాబాద్ ఎఫ్‌సీ) పేరిట ఉన్న రికార్డును సునీల్ ఛెత్రి అధిగమించాడు. శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీ 2–1తో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. గువాహటిలో నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుతో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment