కోల్‌కతాపై చెన్నైయిన్ ఘనవిజయం | Chennai 3-0 Kolkata - Full Time | ISL 2015 | Sakshi
Sakshi News home page

కోల్‌కతాపై చెన్నైయిన్ ఘనవిజయం

Dec 13 2015 1:16 AM | Updated on Sep 3 2017 1:53 PM

కోల్‌కతాపై చెన్నైయిన్ ఘనవిజయం

కోల్‌కతాపై చెన్నైయిన్ ఘనవిజయం

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ లీగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో

 పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ లీగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నైయిన్ ఎఫ్‌సీ కీలక దశలో సత్తా చూపింది. డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాతో శనివారం జరిగిన తొలి అంచె రెండో సెమీస్‌లో 3-0తో ఘన విజయం సాధించింది. దీంతో పాటు లీగ్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు నెగ్గిన తొలి జట్టుగా నిలిచింది.
 
 ఐఎస్‌ఎల్‌లో కోల్‌కతాపై చెన్నైయిన్ గెలవడం ఇదే తొలిసారి. బ్రూనో పెలిస్సారి (38వ నిమిషంలో), జేజే (57), వాలెన్సియా (68) గోల్స్ సాధించారు. ఈనెల 15న జరిగే రెండో అంచె సెమీఫైనల్లో గోవాతో ఢిల్లీ డైనమోస్ తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement