ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్
Published Fri, Nov 11 2016 2:27 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
జంగారెడ్డిగూడెం : స్థానిక బైపాస్ రోడ్డులో బుధవారం రాత్రి వాహనాలను ఆపి పోలీసులమని బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ ఎం.కేశవరావు సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. అదిలాబాద్ జిల్లా అసీఫాబాద్ మండలం టి.నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ సీహెచ్ రాము, కడియం నుంచి నాగపూర్‌కు మొక్కలను రవాణా చేస్తున్నారు. స్థానిక బైపాస్ రోడ్డులో ఎస్సార్ బంక్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి తాము పోలీసులమని బెదిరించి లారీకి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేవని, తమకు కొంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పోలీసులు తాడేపల్లిగూడేనికి చెందిన కలవచర్ల నాగవెంకట రజనీష్, స్థానిక పేరంపేట రోడ్డులో నివశిస్తున్న మల్లవరపు దుర్గాప్రసాద్, పేరంపేటకు చెందిన చదలవాడ కాంతారావును అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement