నేడు వైసీపీ ఆధ్వర్యంలో బంద్
Published Thu, Feb 13 2014 2:14 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్: రాష్ట్ర పునర్విభజన బిల్లును అసెంబ్లీలో తిరస్కరించినా.. యూపీఏ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధపడటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ పాటిస్తున్నట్టు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలి పారు. బంద్‌ను పార్టీ శ్రేణులంతా విజయవంతం చేయూలని పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రజలు అనేక ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా గురువారం నిర్వహించే బంద్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
Advertisement
Advertisement