నేడు కూడా వైసీపీ ఆధ్వర్యంలో బంద్ | Jagan Mohan Reddy's YSR Congress calls for Andhra Pradesh bandh today | Sakshi
Sakshi News home page

నేడు కూడా వైసీపీ ఆధ్వర్యంలో బంద్

Published Fri, Feb 14 2014 3:57 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Jagan Mohan Reddy's YSR Congress calls for Andhra Pradesh bandh today

జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ నిరంకుశ విధానాలను నిరశిస్తూ శుక్రవారం కూడా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బంద్‌కు పిలుపు ఇచ్చారని  పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు.  గురువారం  బాలరాజు మాట్లాడుతూ సీమాంధ్రప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రలను నిలిపి వేయాలని పదే పదే చెబుతున్నా యూపీఏ సర్కార్ నియంతలా ప్రవర్తిస్తూ, పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. 
 
 రాహుల్‌ను దేశ ప్రధానిని చేయాలనే స్వార్థ ఆలోచనతో సోనియా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న 10 ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రప్రజల మనోభాలు దెబ్బతీసేవిధంగా ఆమె ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో చోటుచేసుకున్న పరిణామాలకు సోనియాగాంధీ, ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ప్రధాన కారణమని విమర్శించారు. పార్లమెంట్ సభ్యుల వాదనలు కూడా వినకుండా కేంద్ర హోం శాఖ మంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం, సభను వాయిదా వేయడం కాంగ్రెస్ ఆడుతున్న నాటకాల్లో  భాగమన్నారు. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న ఎంపీలను సస్పెండ్ చేయటం అత్యంత దారుణమని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని బాలరాజు విమర్శించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement