ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శనివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. గోకుల తిరుమల పారిజాతగిరిపై ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా.... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు.
పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరిపై కొలువైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని సదరు మహిళలు ఆటోలో కొండ దిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంకు చెందిన వారని పోలీసులు తెలిపారు.