నగరంలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు.
బెంగళూరు(బనశంకరి) : నగరంలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. చిక్కబళ్లాపుర జిల్లా గవిగానహళ్లి కి చెందిన లక్ష్మినారాయణాచారి, గాయత్రిదేవి(48) దంపతులు తుమకూరురోడ్డు మాదవారలో నివాసముంటున్న కుమార్తెను చూడటానికి నగరానికి చేరుకున్నారు.
మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గవిగానహళ్లికి బైక్‌లో బయలుదేరారు. 8 వ మైల్ జంక్షన్ వద్ద వెనుకనుంచి లారీ ఢీకొంది. ప్రమాదంలో కిందపడిన గాయత్రీదేవిపై లారీ దూసుకెళ్లడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందగా లక్ష్మీనారాయణాచారి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పిణ్యాట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చిక్కజాల పోలీస్‌స్టేషన్ పరిధిలో......
బాగలూరుకు చెందిన భగవాన్‌దాస్, రూపా(50)దంపతులు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో స్కూటర్‌లో బాగలూరు మెయిన్‌రోడ్డులో వెళ్తూ ఉన్నఫళంగా కుడివైపు తిప్పాడు. ఈక్రమంలో వెనుక నుంచి వచ్చిన స్కార్పియోవాహనం అదపు తప్పి స్కూటర్‌ను ఢీకొంది. ప్రమాదంలో కిందపడి తీవ్రంగా గాయపడిన రూపా ఘటనాస్దలంలోనే మృతిచెందింది. గాయపడిన భగవాన్‌దాస్‌ను లీగల్ ఆసుపత్రికి తరలించారు. ఘటన పై చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కారు డ్రైవరు ఫిరోజ్ ను అరెస్ట్ చేశారు.