మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న పేషంట్ సుబ్బమ్మ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.