ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నగరంలోని బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద శనివారం చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నగరంలోని బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.