పోలవరం ముంపు మండలాలను తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్లలో ముంపు మండలాలను చేర్చింది.
కుకునూరు, వేలూరుపాడు మండలాలను జంగారెడ్డిగూడెం డివిజన్‌లో కలిపింది. బూర్గంపాడులోని ఆరుగ్రామాలు కూనవరం, చింతూరు, సీఆర్‌పూర్, భద్రాచలం డివిజన్‌లోని గ్రామాలను రంపచోడవరం డివిజన్‌లో చేర్చినట్టు నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది.