నాన్నా... నీ కోరిక మేరకు... | five daughters perform last rites of their father in jangareddygudem | Sakshi
Sakshi News home page

నాన్నా... నీ కోరిక మేరకు...

Published Mon, Jun 15 2015 9:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

పాడెను మోస్తున్న కుమార్తెలు

పాడెను మోస్తున్న కుమార్తెలు

జంగారెడ్డిగూడెం రూరల్: తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆ ఐదుగురు కుమార్తెలు ఆయనకు అంతిమ సంస్కారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన తెలుగుదేశం నాయకుడు మట్టా నాగేశ్వరరావు (55) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. నాగేశ్వరరావుకు కొడుకులు లేరు.

తన మరణానంతరం మీరే తలకొరివి పెట్టాలని ఆయన తన ఐదుగురు కుమార్తెలను కోరారు. తండ్రి కోరిక మేరకు పెద్ద కుమార్తె జక్కుల సుజాత చితికి నిప్పంటించగా, మిగిలిన నలుగురు కుమార్తెలు.. విజేత, కుమారి, సుబ్బలక్ష్మి, స్వాతి పాడెను మోసి అంత్యక్రియలు నిర్వహించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement