ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 57 కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.