వైసీపీ శ్రేణుల హౌస్ అరెస్ట్
Published Mon, Dec 30 2013 4:01 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
జంగారెడ్డిగూడెం రూరల్, న్యూస్‌లైన్ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటన అడ్డుకుంటారనే భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల చింతలపూడిలో జరిగిన కేంద్ర మంతి కావూరి పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం, అనంతరం కోడిగుడ్లతో దాడికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కావూరి పర్యటన సందర్భంగా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, జీలుగుమిల్లి మండలాల్లో సమైక్యవాణి వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఉదయం 11.30 గంటలకు వాటర్ ట్యాంకు శంకుస్థాపన పనులకు కేంద్రమంత్రి కావూరు సాంబశివరావు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎదుట సమైక్యవాణి వినిపించేందుకు మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు పోల్నాటి బాబ్జి ఇంటి వద్ద జంగారెడ్డిగూడెం మండల, పట్టణ వైసీపీ నాయకులు 21 మంది సిద్ధమయ్యారు.
విషయం తెలుసుకున్న ఎస్సై బీఎన్ నాయక్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంటిలోనే నిర్భంధించి ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. పోల్నాటి బాబ్జి, పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనువాస్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు బొల్లిన వెంకటేశ్వరరావు, మంగా రామకృష్ణ, కాసర సోమిరెడ్డి, పోల్నాటి ఉదయ్‌కుమార్, బల్లే వెంకట రామచంద్రరావు, పోల్నాటి శ్రీనివాసరావు, చల్లారావు, యరమళ్ల గంగా నాగ దుర్గారావు, కూనపాముల వెంకటేశ్వరరావు, పీతల కృష్ణమూర్తి, చిప్పాడ నరసింహరావు, బొజ్జా పరమేశ్వరరావు, పంది రాజా, పస్తుల శివ, పారేపలి నాగేంద్ర, ప్రగడ సత్యనారాయణ, పోల్నాటి సత్యనారాయణ, టెక్కం శ్రీనివాసరావు, పొడుదోలు రాంబాబులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోల్నాటీ బాబ్జి విలేకర్లతో మాట్లాడుతూ మంత్రిని కలువకుండా గృహనిర్భంధం చేయించడం బ్రిటిష్ పాలను తలపించేలా ఉందన్నారు.
చింతలపూడిలో...
చింతలపూడి : ఏడవ విడత భూ పంపిణీలో పాల్గొనడానికి ఆదివారం చింతలపూడికి కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు విచ్చేశారు. ఆయనను నేతలు అడ్డుకుంటారనే భయంతో వైఎస్సార్ సీపీ నాయకులు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని స్థానిక రత్నా అపార్ట్‌మెంట్‌కు తరలించి అపార్ట్‌మెంట్ చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. చింతలపూడి సర్పంచ్ మారిశెట్టి జగన్, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, సీహెచ్ నరేంద్రరాజు, గంధం చంటి, శీలపురెడ్డి రమేష్‌రెడ్డి, జల్లిపల్లి పుల్లారావు, బి.రామరాజునాయక్, మోటపోతుల శ్రీనివాస్‌గౌడ్, కొవ్వూరి రవి, ఎం.తిరుపతిరావు, టి.జయరాజులను అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై బి.మోహన్‌రావు తెలిపారు. వీరిలో కొందరు వృద్ధులు ఉండటంతో వారి ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా అపార్ట్‌మెంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడికి తరలించినట్టు చెప్పారు. మంత్రి పర్యటన పూర్తయిన వెంటనే వారిని విడుదల చేస్తామన్నారు.
జీలుగుమిల్లిలో...
జీలుగుమిల్లి మండలంలో వైసీపీ జిలా ్లస్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రేమ్ కుమార్‌తో పాటు మరో ఆరుగురిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని మధ్యాహ్న సమయానికి వదిలిపెట్టారు.
Advertisement
Advertisement