పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భాస్కర్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని... నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంత కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మంటలార్పి... ఆతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.