
సమావేశంలో పవన్ కల్యాణ్
జంగారెడ్డి గూడెం: రైతే రాజు అంటాం..అలాంటి రైతులు పంటలు వేసి గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకోవడం చూసి బాధ కలుగుతుందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెంలో రైతు సంఘాల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజకీయ నాయకుల ఇళ్లలో వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి గానీ రైతులకు మాత్రం కనీసం గిట్టుబాటు ధర ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ మనకు కనిపించే దేవుడు మాత్రం రైతే అని పేర్కొన్నారు. అన్ని పంటల రైతుల సమస్యలపై అక్టోబర్ 14 తర్వాత వారం రోజులు పాటు వ్యవసాయ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.
రాజకీయాల్లోకి రాకముందు తానూ రైతునేనని చెప్పారు. కష్టమంటే తెలియని వాళ్లు, సమస్యలపై అవగాహన లేని వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని వ్యాక్యానించారు. సంపద కొన్ని కుటుంబాలకే పరిమితమవ్వడం, ఆర్ధిక భద్రత అందరికీ లేకపోవడం, అసమానతలు చూసి రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయిందని, మన తర్వాతి తరాలైన సత్ఫలితాలు చూడాలంటే చిత్తశుద్ధితో పనిచేసే వ్యవస్థ కావాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment