రాజమండ్రి: పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తొక్కిసలాట జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు పుష్కరఘాట్ లోపలే ఉన్నారని తాజాగా వెల్లడైన అంశం పోలీసు, రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తొక్కిసలాట జరిగినట్టు, అప్పటికి 11 మంది భక్తులు మృతిచెందినట్టు ఘాట్ లోపలే ఉన్న సీఎంకు తెలియజేసినట్టు పుష్కర విధుల్లో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారిని ఉటంకిస్తూ తాజాగా మీడియాలో వచ్చిన కథనం సంచలనం రేపింది.