ప్లాస్టిక్ నోట్లతో బాధితుడు
శంకర్‌పల్లి : రిజిస్ట్రేషన్ చేసుకొని చిన్నపిల్లలు ఆడుకొనే నోట్లు ఇచ్చి పారిపోయిన సంఘటన శంకర్‌పల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు కడుచర్ల అంజిలయ్య తండ్రి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అంజిలయ్య తనకు శంకర్‌పల్లి మండల పరిధిలోని మహాలింగపురం గ్రామంలో మూడు వందల గజాల ప్లాటు ఉంది. ఆ ప్లాటును హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి బంటారం మండలం నూర్లంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి మధ్యవర్తిగా ఉండి విక్రయించారు. బుధవారం రోజు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
బయటకొచ్చిన తరువాత రూ1.50 లక్షల డబ్బులు ఇవ్వగా ఆ నోట్లను లెక్కిస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్నపిల్లలు ఆడుకొనే ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయని గుర్తించారు. వెంటనే శ్రీనివాస్‌ను నిలదీయగా ఇచ్చిన లక్షన్నరలో లక్ష రూపాయల రెండు వేల నోట్లు లాక్కొని కారులో పారిపోయాడు. మిగతా రూ. 50 వేలకు ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయి. డబ్బులను లాక్కొని పారిపోతుండగా వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే బాధితుడు చుట్టుపక్కల వారిని పిలిచి జరిగిన విషయాన్ని వివరించాడు. శ్రీనివాస్ ఇచ్చిన నోట్లపై రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియాకు బదులు భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని దాని పక్కనే పాంచ్ సౌ కూపన్ అని నోట్ల కింది భాగంలో పుల్ ఆఫ్ ఫన్ అని ముద్రించారు. బాధితుడు జరిగిన విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment