పెళ్లికొచ్చి...ప్లేట్ల కోసం తన్నుకున్నారు | A Marriage Ceremony In UP Guests Fight For Plates | Sakshi
Sakshi News home page

పెళ్లికొచ్చి...ప్లేట్ల కోసం తన్నుకున్నారు

Published Mon, Jun 25 2018 1:40 PM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

A Marriage Ceremony In UP Guests Fight For Plates - Sakshi

బల్లియా, ఉత్తరప్రదేశ్‌ : పెళ్లికి వచ్చిన అతిథిలు మధ్య భోజన ప్లేట్ల కోసం జరిగిన గొడవలో ఒకరు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం..నాన్హు యాదవ్‌ అనే వ్యక్తి వివాహం విక్రమ్‌పుర్‌ ప్రాంతంలో బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పెద్దసంఖ్యలో అతిథులు హాజరయ్చారు. అంత సేపు సంతోషంగా ఉన్న పెళ్లి మంటప పరిస్థితులు ఉన్నట్టుండి ఒక్కసారి ఉద్రిక్తంగా మారాయి.

భోజన ప్లేట్లు సరిపడా లేకపోవడంతో పలువురు అతిథులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఇది గొడవగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వంట సామగ్రితో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా...విశాల్‌ అనే 20 ఏళ్ల యువకుడు మార్గమధ్యలోనే మృతి చెందాడు. సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement