
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గవరపాలెంలో శనివారం జరిగిన వివాహ వేడుకలో హడావిడి నెలకొంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఒక ఎన్‌ఆర్‌ఐ యువకుడు మోసం చేశాడని యువతి పోలీస్ ఉన్నతాధికారులకు డయల్ 100 నంబరుకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె అక్కడ నుంచి శనివారం అర్ధరాత్రి బయలుదేరింది. ఇంతలో ఆ యువతి అక్కను వెంటబెట్టుకుని అనకాపల్లి పట్టణ ఎస్సై దివాకర్ గవరపాలెంలోని వివాహ వేడుక వద్దకు వెళ్లారు.
అక్కడ సదరు యువతితో పెళ్లికొడుకు కలసి తీసుకున్న ఫొటోలను చూపించి పెళ్లిని ఆపడానికి ప్రయత్నించారు. అయితే పెళ్లికొడుకు బంధువులు ఫిర్యాదు చేసిన యువతి ఉండాలని చెప్పి యథావిధిగా పెళ్లి జరిపారు. ఈ విషయమై పోలీసులను అడగగా.. యువతి వస్తే గాని కేసు నమోదు చేయలేమని అన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment