రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు వచ్చేస్తున్నాయ్‌..! | Approval given to RBI to print Rs 10 plastic notes: Government | Sakshi

రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు వచ్చేస్తున్నాయ్‌..!

Mar 18 2017 1:40 AM | Updated on Mar 22 2019 7:18 PM

రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు వచ్చేస్తున్నాయ్‌..! - Sakshi

రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు వచ్చేస్తున్నాయ్‌..!

భవిష్యత్‌లో పది రూపాయల ప్లాస్టిక్‌ నోట్లు మనకు దర్శనమివ్వనున్నాయి.

న్యూఢిల్లీ: భవిష్యత్‌లో పది రూపాయల ప్లాస్టిక్‌ నోట్లు మనకు దర్శనమివ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 ప్లాస్టిక్‌ నోట్ల ప్రింట్‌కు తన అనుమతిని ఆర్‌బీఐకి చేరవేసింది. ఆర్‌బీఐ దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ నోట్ల వాడకంపై ట్రయల్స్‌ నిర్వహించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేగ్వాల్‌ లోక్‌సభలో శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మనం ఉపయోగించే నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్‌ నోట్ల జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement