
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి నిర్లక్ష్యంతో ఓ కార్మికుడు కత్తుల చట్రంలో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. వివరాలు.. రోజూలాగే ఫ్యాక్టరీలో పనికి వెళ్లిన వాజిద్ (25) ఒక బేడ్లతో కూడిన ఒక మెషీన్‌లోకి దూరి శుభ్రం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో కార్మికుడు వాజిద్ మెషీన్‌లోకి వెళ్లింది గమనించకుండా స్విచాన్ చేశాడు. అంతే.. క్షణాల్లో వాజిద్ శరీరాన్ని మెషీన్‌లో ఉన్న పదునైన బ్లేడ్లు తునాతునకలు చేశాయి.
బాధితుడి ఆర్తనాదాలు విన్న ఆ ఉద్యోగి మెషీన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. వాజిద్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన నొయిడా సెజ్ (ఆర్థిక మండలి)లోని ఓ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయనీ, నిందితున్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మృతుని కుంటుంబం బిహార్‌లోని ఛప్రా జిల్లా నుంచి నొయిడాకు వలస వచ్చిందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment