ఆరేళ్ల బుడతడు తన కల నెరవేర్చుకున్నాడు. ఎవ్వరికీ సాధ్యంకాని దాన్ని సుసాధ్యం చేసుకున్నాడు. అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కలిశాడు. కలవడమే కాదు.. అతడి చంకెక్కి చిరునవ్వులు పూయించాడు.
దోహా: ఆరేళ్ల బుడతడు తన కల నెరవేర్చుకున్నాడు. ఎవ్వరికీ సాధ్యంకాని దాన్ని సుసాధ్యం చేసుకున్నాడు. అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కలిశాడు. కలవడమే కాదు.. అతడి చంకెక్కి చిరునవ్వులు పూయించాడు. ఇటీవల ముర్తాజా అహ్మదీ అనే అఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఆరేళ్ల బుడతడు ఆన్ లైన్‌లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అతడు ఓ ప్లాస్టిక్ కవర్ తో తయారు చేసిన జెర్సీలాంటిదానిపై మెస్సీ అని రాసుకొని మైదానంలో ఫుట్ బాల్ తో ఆడుకుంటూ కనిపించాడు.
ఈ ఫొటోలు, వీడియోలు ఆన్ లైన్ లో వైరల్ అవడమే కాకుండా మెస్సీకి ఈ బుల్లి అభిమాని తెగనచ్చేశాడు. దీంతో మెస్సీ స్వయంగా ఆ బాలుడికి ఈ ఏడాది ఫిబ్రవరిలో తన జెర్సీని బహుమానంగా పంపించాడు. అయితే, ఈ సంఘటన తర్వాత బాలుడి కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి ఫోన్ బెదిరింపులు రావడంతో వారు అక్కడ నుంచి పాక్ లోని క్వెట్టాకు వెళ్లిపోయారు. మెస్సీ జెర్సీ ఫొటో వైరల్ అయిన తర్వాత తన కుమారుడిని ఎవరైనా కిడ్నాప్ చేసి చంపేస్తారేమోనని ముర్తాజా తండ్రి అరిఫ్ తెగ భయపడిపోయాడు. చివరికి ఆ బాలుడు మెస్సీని మంగళవారం దోహాలో కలిశాడు. ముద్దుగా ఉన్న ఆ బాలుడ్ని మెస్సీని స్వయంగా ఎత్తుకొని ఫొటోలకు, వీడియోలు ఫోజిచ్చారు.