ఫ్రాన్స్ విప్లవాత్మక నిర్ణయం | France becomes first country to ban plastic cups and plates | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్ విప్లవాత్మక నిర్ణయం

Published Sat, Sep 24 2016 3:08 PM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

ఫ్రాన్స్ విప్లవాత్మక నిర్ణయం - Sakshi

ఫ్రాన్స్ విప్లవాత్మక నిర్ణయం

పారిస్ :పర్యావరణ పరిరక్షణ కోసం  ఫ్రాన్స్  దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లను  నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  దీంతో ఈ తరహా నిషేధం విధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అవతరించింది.అలాగే  ఒక కొత్త చట్టాన్ని కూడా   ప్రభుత్వం తీసుకురానుంది.  2020 సం.రానికి  డిస్పోజబుల్  వస్తులన్నింటీనీ 50శాతం జీవశాస్త్ర మూలం పదార్థాల నుంచి తయారు చేయాలనే చట్టాన్ని తీసుకురానుంది.  వినియోగం  తర్వాత  వీటిని ఇంటిదగ్గరే  కంపోస్ట్ చేసేలా తయారు చేయాలని  ఆదేశించనుంది.   ఈ పరిమితిని  2025 జనవరి నాటికి ఈ శాతాన్ని 60కి పెంచనుంది.   
మరోవైపు  ఫ్రాన్స్  ప్రభుత్వ నిర్ణయం మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. దీనిపై పలువురు సంతోసం వ్యక్తం చేసినప్పటికీ, ముఖ్యంగా పరిశ్రమ వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిర్ణయం ఈయూ దేశాల చట్టాల ఉల్లంఘన అని వాదిస్తున్నాయి. దీనిపై ఈయు కమిషన్ ను ఆశ్రయించాయి.  బయో ప్లాస్టిక్ వస్తువులకు తాము వ్యతిరేకులం కాదనీ,  కానీ శాస్త్రీయ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కోరారు.
గత ఏడాది  డిశెంబర్ లో వాతావరణ మార్పు పై ప్యారిస్  సీఓపీ 21  శిఖరాగ్ర సమావేశం సదస్సు విజయవంతం తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ ఎనర్జీ  సొల్యూషన్స్ లో  గ్లోబల్ లీడర్ గా ఎదగాలని  యోచిస్తోంది.   మరోవైపు ప్రతి సెకనుకు దాదాపు 150 ప్లాస్టిక్ కప్పుల చొప్పున, సంవత్సరానికి 4.37 బిలియన్ కప్పులను  వాడి పారేస్తున్నట్టు  ఫ్రెంచ్ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ నివేదికలు   చెబుతున్నాయి.  
కాగా ప్లాస్టిక్ బ్యాగుల నిషేధంలో బంగ్లాదేశ్  ముందుంది.  భారీ వరదల్లో  డ్రైనేజీలను ప్లాస్టిక్ బ్యాగులు మంచెత్తేయడంతో...2002లోనే దేశంలో   వీటిని నిషేధించింది.  అనంతరం  దక్షిణ ఆఫ్రికా, కెన్యా, చైనా,  మెక్సికో,రువాండా ఇదే బాటలో నడిచాయి.  మరికొన్ని దేశాల్లో  ఈ ప్లాస్టిక్ వాడకంపై కొన్ని ఆంక్షలు విధించాయి.   ఈ నేపథ్యంలోనే  గత జూలైలో తేలికపాటి ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement