వెంకటాపురం(కె): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో పోలీసులు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రతిరోజూ ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్న వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్నారు.
మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్‌లైన్‌లో కూడా జరిమానా రశీదును అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల కేంద్రంలో అధికారులు బుధవారం తనిఖీ చేస్తుండగా, మాస్క్ లేకుండా బయటకు ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. పోలీసులు తనీఖీలు చేస్తున్నారని గమనించి జరిమానా తప్పించుకునేందుకు దుకాణంలోని ప్లాస్టిక్ కవర్ తీసుకుని మాస్క్‌లా కట్టుకున్నాడు.
( చదవండి: వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి? )
Comments
Please login to add a commentAdd a comment