ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహం | People finds unidentified body in plastic drum, enquiry underway | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహం

Published Sun, Dec 4 2016 9:53 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

People finds unidentified body in plastic drum, enquiry underway

హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ మూసీ కాలువ సమీపంలో ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆదివారం ఉదయం మూసీ కాలువ వైపు వెళ్లిన స్థానికులకు డ్రమ్ములో మృతదేహం కనిపించింది. భయాందోళనలకు గురైన వారు ఎవరో హత్యచేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి తెచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement