Unidentified body
-
రైలు ఢీకొని వ్యక్తి మృతి.. కుడి చేతిపై పచ్చబొట్టు
బాలానగర్: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (35) మృతిచెందిన ఘటన బాలానగర్ రైల్వేస్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి కుడి చేయిపై హితేష్ అనే పచ్చబొట్టు ఉందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
‘అంత్యక్రియలు అయ్యాక ప్రత్యక్షం.. దెయ్యమా ఏంటి?’
జైపూర్: ఓంకార్ గుడిలియ అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. లివర్ చెడిపోయింది. దాంతో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆస్పత్రిలో చేరాడు. నాలుగైదు రోజులు గడిచినా ఇంటికి రాలేదు. ఈ లోపు పోలీసులు గుర్తు తెలియని మృతదేహం గురించి అంటించిన పోస్టర్లు చూసి.. పొరపాటున ఓంకార్ గుడిలియాదిగా భావించి ఆ గుర్తు తెలియని మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వమించారు. అయితే వారం రోజుల తర్వాత ఓంకార్ గుడిలియ ప్రత్యక్షం అయ్యాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దెయ్యం అయ్యాడా ఏంటి అని భయపడసాగారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ వివారలు.. రాజస్తాన్‌లోని రాజ్సమండ్ జిల్లాకు చెందిన ఓంకార్ గుడిలియ ఈ నెల 11న ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉదయ్‌పూర్ వెళ్లాడు. లివర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న అతడు ఆర్కే ఆస్పత్రిలో చేరాడు. లాక్డౌన్ విధించడంతో గుడిలియా కుటుంబం అతడి సోదరుడి ఇంట్లో ఉండిపోయింది. మరోవైపు సరిగా ఓంకార్ ఆస్పత్రిలో చేరిన నాడే గోవర్థన్ ప్రజాపత్ అనే వ్యక్తిని కొందరు హెల్త్ వర్కర్స్ ఆర్కే ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అతడు మరణించడంతో ఆస్పత్రి వర్గాలు గుర్తుతెలియని మృతదేంగా మార్చురీలో ఉంచారు. ఆ తర్వాత ఈ గుర్తు తెలియని మృతదేహం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డెడ్‌బాడీని అనేక యాంగిల్స్‌లో ఫోటో తీసి.. ఆస్పత్రి చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు అంటించారు. మరోవైపు ఓంకార్ గుడలియ ఇంటి నుంచి వెళ్లిపోయి మూడు నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి అతడి ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో తమ ఊరిలో అంటించిన గుర్తు తెలియని మృతదేహం పోస్టర్లు వారిలో అనుమానం రేకేత్తించాయి. దాంతో ఓంకార్ గుడిలియ కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి పదిహేను మందికి పైగా ఆర్కే ఆస్పత్రికి వెళ్లారు. గుర్తు తెలియన మృతదేహాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఓంకార్ కుడి చేతి మీద ఉన్న మచ్చలాంటిదే గోవర్ధన్ చేతి మీద కూడా ఉండటంతో వారు పోరపాటున గోవర్థన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఓ వారం రోజుల తర్వాత ఓంకార్ గుడిలియ తిరిగి రావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘దీనిలో మా తప్పేం లేదు. అతడి కుటుంబ సభ్యులే పొరపాటున గోవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు’’ అని తెలిపారు. చదవండి: మా నాన్న అంత్యక్రియలు మీరే చేయండి -
ఎంజీఎం ఆవరణలో అమానవీయ ఘటన
సాక్షి, వరంగల్ : నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు గుర్తు తెలియని మహిళ మృతదేహం దర్శనమిచ్చింది. కరోనా అనుమానంతో ఆమె బంధువులే ఆస్పతి ముందు స్ట్రెచర్‌పై మృతదేహాన్ని వదిలివెళ్లినట్టుగా తెలుస్తోంది. దాదాపు రెండు గంటల గడుస్తున్న మహిళ మృతదేహం క్యాజువాలిటీ ముందే ఉంది. వర్షంలో మృతదేహం తడుస్తున్నా ఆస్పత్రి సిబ్బంది గానీ, అటుగా వెళ్తున్నవారు గానీ ఎవరు పట్టించుకోవడం లేదు.(ప్రభుత్వాని ఇదే చివరి అవకాశం : హైకోర్టు) -
ఎంజీఎం ఆవరణలో అమానవీయ ఘటన
-
ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహం
హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ మూసీ కాలువ సమీపంలో ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆదివారం ఉదయం మూసీ కాలువ వైపు వెళ్లిన స్థానికులకు డ్రమ్ములో మృతదేహం కనిపించింది. భయాందోళనలకు గురైన వారు ఎవరో హత్యచేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి తెచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
చింతపల్లిలో గుర్తుతెలియని శవం
చింతపల్లి మండలకేంద్రంలోని ఓ మసీదు వద్ద నున్న బావిలో మంగళవారం మహిళ శవం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ శంకర్‌రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ మృతదేహం లభ్యం
చెంచుపల్లి గ్రామ శివారులో మహిళ మృతదేహాం బయటపడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం చెంచుపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గుర్తు తెలియని మహిళ మృత దేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పూర్తిగా కుల్లిపోవడంతో.. గుర్తు పట్టడం సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కాగా.. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. -
గ్రామపంచాయతి కార్యాలయంలో మృతదేహం
గ్రామపంచాయతి కార్యాలయం వెనుక మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లిలో సోమవారం వెలుగుచూసింది. కార్యాలయం ఆవరణలో మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. -
కంపచెట్లలో గుర్తు తెలియని మృతదేహం
ఓ వ్యక్తిని హతమార్చి రోడ్డు పక్కన ఉన్న కంపచెట్లలో పడేసిన సంఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం తాళపోడురోడ్డులోని అయ్యప్ప గుడి వద్ద చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
చెరువులో గుర్తుతెలియని మృతదేహం
నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామశివారులో ఉన్న ఓ చెరువులో గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించి చూడగా.. సుమారు 35 సంవత్సరాల ఉన్న పురుషుడి మృతదేహంగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం
కొవ్వూరు మండలం వాడపల్లిలో ఇసుక ర్యాంపుకి దిగువన ఉన్న ఇసుక మేటల వద్ద గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహాన్ని (40)ను స్ధానికులు సోమవారం గుర్తించారు. శవం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో రెండు, మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఒంటిపై జంథ్యం, గోధుమ రంగు చోక్కా ధరించి ఉన్నాడు. మొలపై స్కాట్ కంపెనీకి చెందిన అండర్వేర్ ఉంది. శవం ఆధారాలు గుర్తుపట్టలేనంతగా పాడైంది. సీఐ పి.ప్రసాదరావు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. ఎస్సై డి.గంగభావానీ ఆధ్వర్యంలో శవాన్ని వెలికి తీశారు. గోదావరిలో ఏదైనా మృతదేహాం కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. జాప్యం చేయడం వలన మృతుడి కుటుంబ సభ్యులు కుడా గుర్తుపట్టలేని పరిస్ధితి ఉంటుందన్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వివరాల కోసం 94407 96622, 94906 95885 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై గంగాభవానీ కోరారు. -
మృతుడు మా ఆయనే
బోరున విలపించిన భార్య సాక్షి కథనంతో వెలుగులోకి వచ్చిన గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ మృతదేహం బంధువులకు అప్పగింత కురబలకోట : గుర్తుతెలియని మృతదేహాన్ని పూడ్చుతుండగా ఆఖరి నిమిషంలో అయిన వారు రావడంతో వారికి అప్పగించిన ఘటన మంగళవారం అంగళ్లులో జరిగింది. ముదివేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. సోమవారం ఉదయం మండలంలోని అమ్మచెరువు మిట్ట వద్దకు ఓ వ్యక్తి వచ్చి పురుగుల మందు తాగేశాడు. స్థానికులు గుర్తించి వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. గుర్తుతెలియని శవంగా ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం సాక్షి దినపత్రికలో మంగళవారం ఫొటోతో సహా ప్రచురితమైంది. బంధువులు ఎవరైనా వస్తారేమోనని సాయంత్రం వరకు మార్చురీలోనే శవాన్ని ఉంచారు. ఎవరూ రాకపోవడంతో పోలీసులు శవాన్ని అంగళ్లు మల్లేల గడ్డ చెరువులో పూడ్చడానికి తీసుకెళ్లారు. ఇంతలో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఫోన్ కాల్ వచ్చింది. ‘సార్..సాక్షి పేపర్లో ఈ రోజు గుర్తుతెలియని వ్యక్తి పురుగుల మందు తాగి మృతిచెందినట్లు వార్త వచ్చింది .. ఆ వ్యక్తి తమ తన భర్తే’నని ఓ మహిళ తెలిపారు. ఎక్కడున్నారంటూ ఫోన్ రావడంతో పోలీసులు శవాన్ని పక్కన పెట్టించారు. కొంత సేపటికే మృతుడి భార్య కళావతి, బంధువులు వచ్చి శవాన్ని చూసి గుర్తించారు. బోరున విలపించారు. ఈ మృతదేహం తన భర్త కృష్ణమూర్తి (41)దేనని చెప్పడంతో ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకుని శవాన్ని వారికి అప్పగించారు. కుటుంబ గొడవల వల్ల ఇతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన ఇతను 15 ఏళ్లుగా మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో మగ్గాలు వేస్తూ జీవనం సాగించేవాడని చెబుతున్నారు. ఇతని భార్య టీకొట్టు నిర్వహించేదని చెబుతున్నారు. సాక్షిలో ఫొటో వార్త రాకపోయి ఉంటే కడ చూపే కాదు విషయం కూడా తెలిసి ఉండేది కాదని మృతుడి బంధువుల తరపున వచ్చిన కుమ్మరి సంఘం నాయకులు అన్నారు. -
హుస్సేన్ సాగర్‌లో మృతదేహం
హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు వెలికితీశారు. ఎస్సై కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం ట్యాంక్‌బండ్‌పై గల కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం ఎదురుగా గల సాగర్ జలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల వయసుంటుందని ఒంటిపై బ్రౌన్ కలర్ ఫ్యాంటు, తెలుపు బ్రౌన్ కలర్ చారల చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
అది హత్యా.. ! ఆత్మహత్యా..!
మామిడితోటలో పడి ఉన్న మృతదేహం ఆ గ్రామంలో కలకలానికి కారణమైంది. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలోని ఎన్ఎస్పీ కాలువ ఒడ్డున ఉన్న మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. అతని షర్టు జేబులో చుండూరు - విజయవాడ రైలు టికెట్‌తోపాటు విజయవాడ - మైలవరం బస్సు టికెట్లు లభించాయి. అతనిని ఎవరైనా చంపి అక్కడ పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది నిర్ధారణ కాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రప్రోలు గ్రామ సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి(65) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పక్కన మోనోక్రోటోఫాస్ పురుగు మందు డబ్బా పడి ఉంది. అతని జేబులో ఈనెల 21వ తేదీనాటి హాలియా - మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు టికెట్ ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పెట్రోలు పోసి కాల్చేశారు
గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి తగల బెట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చిరు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకుగల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
బండరాళ్లతో మోది చంపేశారు
రంగారెడ్డి (మోమిన్‌పేట) : ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో మోది అంతం చేశారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటలో వెలుగులోకి వచ్చింది. మోమిన్‌పేటలోని కొత్త బస్టాండ్ సెంటర్లో సుమారు 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తిని దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని ఆదివారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
హత్య చేసి.. తగలబెట్టి..
* చినరావుపల్లిలో దారుణం * రంగంలోకి దిగిన పోలీసులు * మృతుని వివరాలు సేకరణ.. * నిందితుల కోసం నాలుగు బృందాలు * సంచలనం రేకెత్తించిన సంఘటన ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురం పరిధిలోని చినరావుపల్లిలో దారుణం జరిగింది.గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేశారు. మృతదేహం సగంసగం కాలి గుర్తించడానికి వీల్లేకుండా ఉంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బుధవారం సాయంత్రం గ్రామంలో కాలిపోయిన గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు గ్రామ రెవెన్యూ అధికారి జరుగుళ్ల వెంకటరమణమూర్తికు తెలియజేయ గా అతని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం జేఆర్‌పురం సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు. మృతదేహాన్ని వాహనంలో గోనె సంచిలో పెట్టి తీసుకొచ్చి బయటకు తీయకుండానే కిరోసిన్,పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు. మృత దేహానికి నిప్పు అంటించాక నిందితులు అక్కడ నుంచి పరారై ఉంటారని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం డీఎప్సీ కె.భార్గవ నాయుడు, క్లూస్ టీం కూడా సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. మృతదేహాన్ని పరిశీలించి తలపై గాయాలు ఉన్నట్టు డీఎస్పీ గుర్తించారు. క త్తితో నరికి చంపి ఉంటారని.. మృతి చెందిన వ్యక్తి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ నేర సంఘటనలో ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండి ఉంటుం ది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారి పక్కనే.. మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతం ఆర్అండ్బీ రహదారికి అనుకొని కిలోమీటరు దూరంలో ఉంది. ఆ పక్క నుంచే కాలిబాట ఉంది. ఆర్అండ్బీ రహదారి నుంచి లావేరు మండలం బయ్యన్న పేట, మురపాక తదితర గ్రామాలకు ఈ దారి గుండా రాకపోకలు సాగి స్తారు. ఆ సమీపంలోనే షిర్డీసాయి ఆలయం కూడా ఉంది. ఎక్కడా మిస్సింగ్ కేసులు లేవు.. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల పోలీసుస్టేషన్ల పరిధిలో ఎక్కడ ఈ మధ్యకాలంలో అదృశ్యం కేసులు కూడా నమోదు కాలేదని డీఎస్పీచెప్పారు. మృత దేహం ఎవరిది అన్న మిస్టరీ వీడితే నిందితుల వివరాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు. మృతుని ఆచూకీ కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దహనం జరిగిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే ప్రదేశంలో గతంలో పలువురి ఆత్మహత్య చినరావుపల్లి ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో గతంలో పలు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. వందల ఎకరాల్లో జీడిమామిడి తోటలు ఉండటం..జన సంచారం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ ప్రేమ జంట ఇదే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే మరో ఇద్దరు జీడి మామిడి చెట్లకు ఊరిపోసుకుని మృతిచెందారు. జన సంచారం పెద్దగా లేని కారణంగా సంఘటన జరిగి రోజులు గడిచాక విషయం బయటకు వస్తోంది.