నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రప్రోలు గ్రామ సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి(65) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రప్రోలు గ్రామ సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి(65) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పక్కన మోనోక్రోటోఫాస్ పురుగు మందు డబ్బా పడి ఉంది. అతని జేబులో ఈనెల 21వ తేదీనాటి హాలియా - మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు టికెట్ ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.