గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి తగల బెట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చిరు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకుగల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
పెట్రోలు పోసి కాల్చేశారు
Published Tue, Sep 15 2015 9:40 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement