అది హత్యా.. ! ఆత్మహత్యా..! | Is it Murder or Suicide ? | Sakshi
Sakshi News home page

అది హత్యా.. ! ఆత్మహత్యా..!

Published Wed, Sep 23 2015 2:06 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Is it  Murder or  Suicide ?

మామిడితోటలో పడి ఉన్న మృతదేహం ఆ గ్రామంలో కలకలానికి కారణమైంది. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలోని ఎన్‌ఎస్‌పీ కాలువ ఒడ్డున ఉన్న మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. అతని షర్టు జేబులో చుండూరు - విజయవాడ రైలు టికెట్‌తోపాటు విజయవాడ - మైలవరం బస్సు టికెట్లు లభించాయి. అతనిని ఎవరైనా చంపి అక్కడ పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది నిర్ధారణ కాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement