చెంచుపల్లి గ్రామ శివారులో మహిళ మృతదేహాం బయటపడింది.
చెంచుపల్లి గ్రామ శివారులో మహిళ మృతదేహాం బయటపడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం చెంచుపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గుర్తు తెలియని మహిళ మృత దేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పూర్తిగా కుల్లిపోవడంతో.. గుర్తు పట్టడం సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కాగా.. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు.