గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం | Unidentified man 's body Found in godavari | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం

Published Mon, Nov 9 2015 5:57 PM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

Unidentified man 's body Found in godavari

కొవ్వూరు మండలం వాడపల్లిలో ఇసుక ర్యాంపుకి దిగువన ఉన్న ఇసుక మేటల వద్ద గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహాన్ని (40)ను స్ధానికులు సోమవారం గుర్తించారు. శవం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో రెండు, మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఒంటిపై జంథ్యం, గోధుమ రంగు చోక్కా ధరించి ఉన్నాడు.

మొలపై స్కాట్ కంపెనీకి చెందిన అండర్‌వేర్ ఉంది. శవం ఆధారాలు గుర్తుపట్టలేనంతగా పాడైంది. సీఐ పి.ప్రసాదరావు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. ఎస్సై డి.గంగభావానీ ఆధ్వర్యంలో శవాన్ని వెలికి తీశారు. గోదావరిలో ఏదైనా మృతదేహాం కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. జాప్యం చేయడం వలన మృతుడి కుటుంబ సభ్యులు కుడా గుర్తుపట్టలేని పరిస్ధితి ఉంటుందన్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వివరాల కోసం 94407 96622, 94906 95885 నెంబర్‌లను సంప్రదించాలని ఎస్సై గంగాభవానీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement