
వెర్రి వెయ్యి విధాలు అంటారు.. ఆ మాటను పెద్దలు ఊరికే అనలేదు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే ఈ విషయం అర్థం అవుతుంటుంది. ఇదిగో ఆ కోవలోకే చెందుతాడు.. ఈ ఫొటోలోని వ్యక్తి. థాయ్‌లాండ్‌కు చెందిన 25 ఏళ్ల రచడపాంగ్ ప్రసిత్‌కు కొరియాకు చెందిన వ్యక్తిలాగా కనిపించడం అంటే ఇష్టం. అతడేమో థాయ్‌లాండ్‌కు చెందినవాడు. అందుకోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించాడు. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 30 వరకు సర్జరీలు చేయించుకుని అసలు ముందున్న ముఖానికి, ప్రస్తుతం ఉన్న ముఖానికి కొంచెం కూడా సంబంధం లేకుండా తయారయ్యాడు. ఓ రకంగా కొత్త ముఖం పెట్టుకున్నాడనే చెప్పుకోవచ్చు. దీంతో ఆసియా మొత్తం ప్రసిత్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే కొరియాకు చెందిన సింగర్, నటుడు మిన్హోను స్ఫూర్తిగా తీసుకుని ఆయనకు దగ్గరి పోలికలు ఉండేలా ముఖాన్ని మార్చుకున్నాడు. ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే.. తాను డ్యాన్సర్‌ను అని, ఎన్ని టీవీ షోలకు ఆడిషన్స్ ఇచ్చినా ఎంపిక కాలేదని ప్రసిత్ చెప్పాడు. తన ముఖం వల్ల వ్యక్తిగతంగా గానీ, వృత్తి పరంగా కానీ తాను విజయవంతం కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తన ముఖాన్ని మార్చుకోవడమేననే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు. తన ముఖం మొత్తం ఇలా మార్పు చెందేందుకు రెండేళ్లు పట్టిందట. ముఖం మారిన తర్వాత లక్కు కలిసొచ్చిందని, డ్యాన్సర్‌గా చాలా టీవీ షోలు చేస్తున్నానని, జీవితం ఇప్పుడు సెట్ అయిందని సంతోషపడుతున్నాడు. మొత్తానికి కొరియా వాళ్ల ముఖం అంటే పిచ్చో.. లేదా కెరీర్ మీద దృష్టో కానీ ప్రసిత్ జీవితం అలా ప్రశాంతంగా గడిచిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment