
జనగామలో ప్లాíస్టిక్ బియ్యం కలకలం
ఎగిరి పడుతున్న అన్నం ఉండలు
భోజనం చేసిన కుటుంబ సభ్యులకు అస్వస్థత
జనగామ: జనగామలో ప్లాస్టిక్ బియ్యం గురువారం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ బియ్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న క్రమంలో జిల్లా కేంద్రంలో అమ్మకాలు వెలుగులోకి రావడం సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తుంది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు సమీపంలోని ఎస్‌బీఐ ఏడీబీ బ్యాంకు ఎదురుగా నివాసముంటున్న కంతి శివశంకర్ రెండు రోజుల క్రితం ఎల్‌జీ కంపెనీకి చెందిన 25 కిలోల బియ్యం కొనుగోలు చేశాడు. బుధవారం రాత్రి ఆయన భార్య చందన అన్నం వండగా కొత్త రకమైన వాసన రావడంతో అనుమానం కలిగింది. భర్తతో పాటు ఎల్‌కేజీ చదువుకుంటున్న కుమారుడికి వడ్డించింది. అదే రోజు రాత్రి కుమారుడు వాంతులు చేసుకోగా ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు.
అనుమానం వచ్చిన శివశంకర్ పరిశీలి ంచగా ప్లాస్టిక్ బియ్యంగా అనుమానించాడు. ఈ విషయాన్ని స్థానికులకు తెలపడంతో భోజనాన్ని ముద్దలుగా తయరు చేసి నేలకు కొట్టడంతో బంతుల్లాగా పైకి ఎగిరి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. చుట్టపక్కల కాలనీవాసులు తమ ఇంట్లో నిల్వ ఉన్న బియ్యాన్ని అనుమానంగా పరిశీలించుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని శివశంకర్ తెలిపాడు. కాగా జనగామలో ప్లాస్టిక్ రైస్ అమ్మకాలు చేస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్లాస్టిక రైస్ లేక పాలిషింగ్ చేసిన బియ్యమా నిజానిజాలు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగాలని ప్రజలు కోరుతున్నారు.