విష జ్వరం కారణంగా ప్లేట్‌లెట్స్ తగ్గి ఒక బాలుడు మృతి చెందాడు.
గోదావరిఖని (కరీంనగర్ జిల్లా) : విష జ్వరం కారణంగా ప్లేట్‌లెట్స్ తగ్గి ఒక బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో జరిగింది. వివరాల ప్రకారం.. సింగరేణిలో పని చేస్తున్న కార్మికుడు పూల్‌సింగ్ కుమారుడు రవితేజ(11) తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా శనివారం బాలుడికి జ్వరం రావడంతో సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.
బాలుడిని పరీక్షించిన వైద్యులు ప్లేట్‌లెట్స్ తగ్గాయని గుర్తించారు. అయితే జ్వరం తగ్గిన తర్వాతనే ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తామని డాక్టర్లు తండ్రికి చెప్పారు. దీంతో తండ్రి వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని డాక్టర్లను కోరగా, జ్వరం తగ్గిన తర్వాత పంపిస్తామని తెలిపారు. ఇదే క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఆదివారం ఉదయం మృతి చెందాడు.