
మంటలార్పుతున్న ఫైర్‌సిబ్బంది
రాజేంద్రనగర్: విద్యుత్ షార్ట్ సర్కూ్యట్ కారణంగా సోమవారం కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో కంపెనీకి సెలవు ఇవ్వడంతో ప్రాణనష్టం తప్పింది. వివరాలు... నగరానికి చెందిన ముఖేష్ కాటేదాన్ పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఆనంద్‌నగర్‌లో 2 వేల గజాల స్థలంలో పెద్ద షెడ్ వేసి జేబీఎస్ ఫాలిమార్ కంపెనీని పేరిట ప్లాస్టిక్ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్లాస్టిక్ దానాతో పాటు ప్లాస్టిక్ సామగ్రిని తయారు చేస్తారు. సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వచ్చింది. కొద్దిసేపట్లోనే మంటలు కంపెనీ మొత్తం వ్యాప్తించాయి. ప్లాస్టిక్ కాలడంతో వల్ల ఆకాశాన్ని అంటేలా వస్తున్న దట్టమైన పొగ కిలో మీటరు మేర వ్యాపించింది. పొగవల్ల స్థాని కు లు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న జిల్లా అసిస్టెం ట్ ఫైర్ అ«ధికారి భగవాన్‌రెడ్డి రాజేంద్రనగర్, మొగల్‌పుర, గౌలిగూడ, మలక్‌పేటల నుంచి ఫైర్‌ఇంజిన్లు రప్పిం చారు. అగ్నిమాపక సిబ్బంది ఒకపక్క మంటలను ఆర్పుతూనే మరోపక్క ఇతర కంపెనీలకు మంటలు వ్యాపించకుండా వాటిపై నీటిని వెదజల్లారు. సుమారు రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కాగా, ఈ ప్రమాదంలో రూ. 35 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు తెలిసింది. ప్రమాదసమయంలో పోగలు కిలోమీటర్ మెర వ్యాపించాయి. కాగా, ఇంత పెద్ద పరిశ్రమలో చిన్నపాటి అగ్నిమాపక పరికరం ఉందని, అది కూడా కాలం ముగిసిపోయిందేనని పోలీసులు చెప్పారు. ఈ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.