katedan
-
కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: మైలార్దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మాట్లార్పుతోంది. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బుడిదైంది. కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అంచనా. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. -
కుళ్లిపోయిన అల్లం వెల్లులితో పేస్ట్ తయారీ
-
అనగనగా..ఓ చిరుత
సాక్షి, హైదరాబాద్ : 2004, డిసెంబర్ 9వ తేదీ.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 71 తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ.. ఓ చిరుతపులి 43వ నంబరు ప్లాట్‌లో నివసించే పారిశ్రామికవేత్త జయప్రకాశ్–సాయిలీల దంపతుల ఇంట్లోకి ప్రవేశించింది. అదే సమయంలో వంటగదిలో ఇంటి పనులు చేస్తున్న పనిమనిషి కిటికీ తెరిచింది. ఇంకేముందు ఎదురుగా చిరుతపులి కనిపించింది. ఒక్కసారిగా టెన్షన్‌కు గురైన ఆ పనిమనిషి, వెంటనే తేరుకొని జయప్రకాశ్ దంపతులను అప్రమత్తం చేసింది. వెంటనే వారు ఇంటికి అన్నివైపులా ఉన్న తలుపులు, కిటీకీలు మూసేసి పోలీసులకు ఫోన్ చేశారు. అప్పటి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఎన్.సి. చంద్రశేఖర్ తన సిబ్బందితో వచ్చారు. పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే ఆయన జూ అధికారులకు ఫోన్ చేసి, అటవీ సిబ్బందిని రప్పించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన పోలీసులు, అటవీ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఆ చిరుత చిక్కకపోగా, గోడ దూకి పక్కింట్లోకి వెళ్లింది. అలా ఓ నాలుగైదు ఇళ్లు దాటుకుంటూ వెళ్లి...ఓ ఇంట్లోని బాత్రూమ్లో వెళ్లింది. ఎలాగైనా బాత్రూమ్లోనే చిరుతను బంధించాలని అటవీ అధికారులు, పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయినా ఆ చిరుత వారి కళ్లుగిప్పి బాత్రూమ్ నుంచి పక్కింట్లోకి జారిపోయింది. ఇలా మళ్లీ ఆరేడు ఇళ్లు దాటుకుంటూ పారిపోయింది. ఇక దానిని వలేసి పట్టడం సాధ్యం కాదని భావించారు. పారిపోతున్న చిరుతపై ఇన్స్పెక్టర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో చిరుత అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అటవీ అధికారులు బోనులో బంధించి జూపార్కుకు తీసుకువెళ్లి చికిత్స చేశారు. కోలుకున్న తర్వాత అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలేశారు. 2020, మే 14వ తేదీ.. కాటేదాన్ అండర్ పాస్ ఉదయం ఏడున్నర ప్రాంతంలో అండర్‌పాస్ డివైడర్‌ను ఆనుకొని ఓ చిరుత కనిపించింది. చూసినవారంతా ఏదో గాయమైన అక్కడ పడుకుని ఉందని భావించారు. కొంతమంది స్థానికులు అక్కడకు వెళ్లే ప్రయత్నం చేశారు. తీరా దగ్గరకు వెళ్లేసరికి ఆ చిరుత వాయువేగంతో ఆరు ఫీట్ల ఎత్తయిన గోడ దూకి బుద్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లోకి వెళ్లింది. ఆ ఫామ్ హౌస్ 55 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. వినియోగంలో లేని ఫామ్‌హౌస్ కావటంతో చిరుతను పట్టుకోవడం అటవీ అధికారులకు అంత సులువేం కాదు. గురువారం అర్ధరాత్రి వరకూ చిరుత బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగాయి. అయితే చిరుత సంచారంతో బుద్వేల్లోని వెంకటేశ్వరకాలనీ, శ్రీరాంనగర్, నేతాజీనగర్ బస్తీ వాసులు గజగజ వణికిపోతున్నారు. -
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం..
-
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమకు చెందిన గోడౌన్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని తెలుస్తోంది. పరిశ్రమతో, గోడౌన్ యజమాన్యం వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్లాస్టిక్ పరిశ్రమ బుగ్గిపాలు
రాజేంద్రనగర్: విద్యుత్ షార్ట్ సర్కూ్యట్ కారణంగా సోమవారం కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో కంపెనీకి సెలవు ఇవ్వడంతో ప్రాణనష్టం తప్పింది. వివరాలు... నగరానికి చెందిన ముఖేష్ కాటేదాన్ పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఆనంద్‌నగర్‌లో 2 వేల గజాల స్థలంలో పెద్ద షెడ్ వేసి జేబీఎస్ ఫాలిమార్ కంపెనీని పేరిట ప్లాస్టిక్ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్లాస్టిక్ దానాతో పాటు ప్లాస్టిక్ సామగ్రిని తయారు చేస్తారు. సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వచ్చింది. కొద్దిసేపట్లోనే మంటలు కంపెనీ మొత్తం వ్యాప్తించాయి. ప్లాస్టిక్ కాలడంతో వల్ల ఆకాశాన్ని అంటేలా వస్తున్న దట్టమైన పొగ కిలో మీటరు మేర వ్యాపించింది. పొగవల్ల స్థాని కు లు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న జిల్లా అసిస్టెం ట్ ఫైర్ అ«ధికారి భగవాన్‌రెడ్డి రాజేంద్రనగర్, మొగల్పుర, గౌలిగూడ, మలక్పేటల నుంచి ఫైర్‌ఇంజిన్లు రప్పిం చారు. అగ్నిమాపక సిబ్బంది ఒకపక్క మంటలను ఆర్పుతూనే మరోపక్క ఇతర కంపెనీలకు మంటలు వ్యాపించకుండా వాటిపై నీటిని వెదజల్లారు. సుమారు రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కాగా, ఈ ప్రమాదంలో రూ. 35 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు తెలిసింది. ప్రమాదసమయంలో పోగలు కిలోమీటర్ మెర వ్యాపించాయి. కాగా, ఇంత పెద్ద పరిశ్రమలో చిన్నపాటి అగ్నిమాపక పరికరం ఉందని, అది కూడా కాలం ముగిసిపోయిందేనని పోలీసులు చెప్పారు. ఈ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. -
విడాకులు ఇప్పించాడని హత్య
బావ అన్నను హతమార్చిన యువకులు కాటేదాన్: పెళ్లైన తొమ్మిది నెలలకే తమ సోదరికి విడాకులిప్పించాడని కక్షగట్టి బావ అన్నను ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా హతమార్చారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎస్ఎన్ జావీద్ కథనం ప్రకారం... టోలిచౌకికి చెందిన ఖాదర్అలీ(40) మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని అలీనగర్‌లో ప్లాస్టిక్ వేస్టేజ్ బాటిళ్ల పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ఇతని సోదరుడు హలీమ్‌కు 9 నెలల క్రితం తహనీస్తో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే హలీమ్, తహనీస్ల మధ్య మనస్పర్థలు రావడంతో హలీమ్ తన భార్యకు విడాకులిచ్చి వేరుగా ఉంటున్నాడు. హలీమ్ విడాకుల విషయంలో అతని అన్న కల్పించుకొని విడాకులు ఇప్పించాడని కక్షగట్టిన తహనీస్ సోదరులు అబ్దుల్లా, తాహెర్‌లు హలీమ్ అన్న హత్యకు పథకం పన్నారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి 11.30కి పరిశ్రమ నుంచి కారులో ఇంటికి వెళ్తున్న ఖాదర్అలీపై అబ్దుల్లా, తాహెర్‌లు దాడికి పాల్పడ్డారు. ముందస్తు పథకం ప్రకారం అతని కళ్లల్లో కారం చల్లి విచక్షణారహితంగా కత్తులు, బాటిళ్లతో దాడి చేసి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పో లీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాత్రి 12.30కి బాధితుడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా డు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులంటున్నారు. నిందితులు అబ్దుల్లా, తాహెర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు పట్టుబడితే హత్యకు గల వివరాలు తెలుస్తాయని సీఐ జావీద్ తెలిపారు. -
అత్తారింటికి వెళ్తే..
అల్లుడిని చితకబాదిన అత్త తాగిన మైకంలో చిందులు తీవ్రగాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అమాయక అల్లుడు కాటేదాన్,న్యూస్‌లైన్: మేనత్తను తన తాతయ్య వద్దకు తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడి చివరకు ఒప్పించి మెప్పించి తీసుకెళ్తాడు హీరో.. ఇది ఇటీవల వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఉద్దేశం. కానీ కట్టుకున్న భార్యను పంపించండి అత్తా..అని మర్యాదగా అడిగినందుకు తీవ్రంగా దాడిచేసింది ఇక్కడి అత్త. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బుద్వేల్‌లో జరిగింది. తాగిన మైకంలో అత్త చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన అల్లుడు చివరకు ఎలాగోలా బయటపడి పోలీసులను ఆశ్రయిం చాడు. వివరాలి ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన నర్సింహకు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన శంకరమ్మ కూతురితో మూడేళ్లక్రితం పెళ్లయ్యింది. పదిరోజుల క్రితం నర్సింహ భార్య పుట్టింటికొచ్చింది. కూలీ పనిచేసుకునే నర్సింహ తనభార్యను కాపురానికి పంపించాలంటూ శుక్రవారం నగరానికొచ్చి అత్త శంకర మ్మను కోరాడు. అంతే అప్పటికే తాగినమైకంలో ఉన్న అత్త నర్సింహపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. అంతటితో ఆగకుండా కొట్టి జేబులో ఉన్న డబ్బులు లాక్కొని ఏంచేసుకుం టావో చేసుకోపో..అని తరిమేసింది. నుదిటిపై తీవ్రగాయమై రక్తంరావడంతో అల్లుడు నర్సింహ అత్తపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్దఉన్న డబ్బులు లాక్కుందని, ఊరికివెళ్లేం దుకు ఎవరైనా చిల్లర డబ్బులిస్తే వెళ్లిపోతానంటూ పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతిఒక్కరినీ నర్సింహ వేడుకోవడం విస్మయానికి గురిచేసింది.