రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమకు చెందిన గోడౌన్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని తెలుస్తోంది. పరిశ్రమతో, గోడౌన్ యజమాన్యం వివరాలు తెలియాల్సి ఉంది.