plastic godown
-
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని టిక్రీ కలాన్‌లో ఉన్న పీవీసీ మార్కెట్ శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వివరాల ప్రకారం.. టిక్రీ కలాన్‌లో ఉన్న పీవీసీ మార్కెట్లో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు ఉన్న కారణంగా పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. కిలోమీటర్ దూరంలో కూడా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్కే దువా చెప్పారు. #WATCH | Delhi: Morning visual from Tikri Kalan area where fire broke out in a plastic godown during the early hours today. 25 fire tenders at the spot. No casualties reported so far. https://t.co/yhTyNp2M4y pic.twitter.com/Clr2ul8CmF — ANI (@ANI) April 8, 2023 -
ఢిల్లీ గోడౌన్లో మంటలు ఆర్పుతున్న 'రోబో': వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుఝామున 2.18 గంటకు చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఐతే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలుకాలేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేయడంలో ఎరుపు రంగు రోబో కీలక పాత్ర పోషించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గత నెలలో రెండు రోబోలను ఆస్ట్రేలియా కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఆ రోబోలో ఒకటి ఈ రెడ్ రోబో. ఈ అగ్నిమాపక రోబోలను ఉపయోగించడం వల్ల త్వరిగతగతిన మంటలు అదుపులోకి తీసుకురాగలమని, సాధ్యమైనంత మేర తక్కువ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఇవి సుమారు 100 మీటర్ల దూరం నుంచి కూడా మంటలను ఆర్పగలదు. ఇరుకైన మార్గంలో సంభవించిన ప్రమాదాల్లో సైతం ఈ రోబోలు చాలచక్కగా నావిగేట్ చేసి మంటలను ఆర్పేస్తాయని అంటున్నారు. ఇవి నిమిషానికి దాదాపు 2 వేల లీటర్లు చొప్పున నీటిని విడుదల చేయగలవు. ఇవి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎగిసి పడుతున్న అగ్నికీలల స్థాయిని బట్టి సామర్థ్యం మేర నీటిని విడుదల చేసేలా ప్రత్యేక విభాగం కూడా ఉంది. వీటికి సెన్సార్, కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. ఇవి నాలుగు కిలోమీటర్ల వేగంతో కదలగలవు. Our government has procured remote-controlled fire fighting machines. Our brave fireman can now fight fires from a maximum safe distance of upto 100 meters. This will help reduce collateral damage and save the precious lives. pic.twitter.com/1NjGX3ni3B — Arvind Kejriwal (@ArvindKejriwal) May 20, 2022 (చదవండి: షాకింగ్ ఘటన.. ఆమె చేతులు కట్టేసి భవనం పై నుంచి తోసేసి....: వీడియో వైరల్) -
YSR Kadapa: ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
వైఎస్సార్ కడప: వైఎస్సార్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బద్వేలులోని నాగభూషణం డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ షాపులో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మైదుకురు, పోరుమామిళ్ల నుంచి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి -
రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగర శివారు మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దానమ్మ దోపిడి ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలతోపాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆర్పేందుకు రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతోఎలాంటి ప్రాణ హానీ జరగలేదు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే స్కాప్ గోదానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వనట్లు, సంబంధిత అధికారుల అండదండలతోఈ దందా కోనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
ఉలిక్కిపడిన ‘పేట’..!
సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని వెంకటసాయి పాత సామగ్రి గోదాములో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. కానీ పాత సామగ్రి గోదాములో కటింగ్ మిషన్‌తోనే ఈ పేలుడు తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. పట్టణంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై పక్కన జీవీవీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చిరునోముల గ్రామానికి చెందిన మెట్టెల నాగరాజు మూడు సంవత్సరాల క్రితం వెంకటసాయి పాత ఇనుప సామగ్రి దుకాణం నెలకొల్పాడు. ఈ దుకాణంలో సుమారు 30 మందికి పైగా పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొంత మంంది, స్థానిక పరిసర గ్రామాలకు చెందిన కొంత మంది దీంట్లో పనిచేస్తుంటారు. రోజుమాదిరిగానే ఎవరి పనిలో వారు నిమగ్నమైపోయి ఉన్నారు. కానీ షెడ్ లోపల రాంచందర్ సాహో మిషన్‌తో డబ్బాలను ముక్కలుముక్కలుగా చేస్తున్నాడు. సుమారు 20 ప్లాస్టిక్ డబ్బాలకు పైగా కట్ చేశాడు. గాయపడిన బుజ్జి, సల్మాన్‌ఖాన్ కుప్పలుతెప్పలుగా ఉన్న డబ్బాలను కట్‌చేస్తుండగా..ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ రేకుల షెడ్లో రాంచందర్ సాహోతో పాటు కటింగ్ మిషన్ వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సల్మాన్‌ఖాన్, చివ్వెంల మండలం రాంకోటి తండాకు చెందిన బుజ్జిలు పనిచేస్తున్నారు. కొద్ది దూరంలోనే చిలుకమ్మతో పాటు మరో నలుగురైదురుగు పనిచేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి రాంచందర్‌సాహో(45) మృతదేహం పదిహేను మీటర్ల దూరంలో పడిపోయింది. అంతేకాకుండా ఆయన శరీరం చిధ్రమై అవయవాలు బయటపడ్డాయి. మిషన్‌లోని భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. సాహో పక్కనే పనిచేస్తున్న సల్మాన్ ఖాన్, బుజ్జిలకు తీవ్ర .. చిలకమ్మకు స్వల్ప గాయాలతో బయటపడింది. వారిని స్థానిక ఏరియాస్పత్రికి తరలించారు. వీరిలో సల్మాన్‌ఖాన్‌కు విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి.. రాంచందర్‌సాహో ప్లాస్టిక్ డబ్బాలు కట్ చేస్తుండగా అధిక లోడుతో కట్టర్ మిషన్ బ్లాస్ట్ అయిందని తొలుత పోలీసులు భావించారు. కానీ మిషన్‌లోని భాగాలు దెబ్బతిన్నట్లుగా కన్పించడం లేదు. కేవలం పైభాగాలు మాత్రమే పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే సాహో కట్ చేసే ప్లాస్టిక్ డబ్బాలో జిలెటిన్‌స్టిక్ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమమయ్యాయి. ఏదీఏమైనా ఘటనా స్థలంలోని పేలుడు ధాటిని చూస్తే మాత్రం బాంబు పేలిందన్న రీతిలో ఉంది. సాహో మృతదేహం పదిహేను మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అంతేకాకుండా షెడ్ రేకులు లేచిపోయాయి. కటింగ్ మిషన్ పక్కనే ఉన్న గోడ పూర్తిగా పగిలిపోయింది. పేలుడు ఇలా జరిగిందని.. రసాయన డబ్బాను కోస్తుండగా పేలుడు సంభవించిందని చివరకు పోలీసులు నిర్ధారించారు. స్పేర్ పంపులు, రసయనాలు వాడిన ఖాళీగా ఉన్న డబ్బాలు గోదాములో భారీగా ఉన్నాయి. కొన్ని డబ్బాలు మూత పెట్టి ఉండగా మరికొన్ని రంధ్రాలు పడి ఉన్నాయి. కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్లు ప్రత్యేక పరిస్థితుల్లో పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. పెయింట్లలో కలిపే థిన్నర్లు ఈ కోవకు చెందుతాయి. కొంత రసాయనం డబ్బాకు అంటుకొని ఉండి, దానికి ఎక్కడ రంధ్రం లేకుండా ఉండి మూత పెడితే అందులో మంట స్వభావాన్ని కలిగి ఉండే వాయువులు ఏర్పడత్తాయి. అలాంటి డబ్బాలను తెరిచినప్పుడు ఒక్కసారిగా శబ్దం వస్తుంది. ఇలానే మూత పెట్టిన రసాయన డబ్బాను మిషన్ కట్టర్‌తో కోయడం లేదా, రసాయనం అంటుకుని ఉన్న డబ్బాను కట్టర్‌తో కోస్తున్నప్పుడు వేడికి స్పార్క్స్ ఒక్కసారిగా లోపటి రసాయన వాయువలకు తగడలడంతో మంటలతో కూడిన భారీ పేలుడు జరుగుతుంది. ఇదే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈనెల 8న హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో రసాయన డబ్బా మూత తీస్తుండగా అది పేలి ఒక వ్యక్తి మృతిచెందాడని పేర్కొన్నారు. నెల రోజులు కాకముందే.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాంచందర్‌సాహో ఇంత కాలం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ఓ ప్లాస్టిక్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడి ప్లాస్టిక్ యజమానికి అక్కడ ప్లాస్టిక్ యజమానికి పరిచయంతో సాహోను సరిగ్గా నెల ఆఖరి తేదీన వెంకటసాయి ప్లాస్టిక్ దుకాణంలో పనిలో కుదిరాడు. కేవలం ప్లాస్టిక్ డబ్బాలను కటింగ్ చేసే పనిలో మాత్రమే కుదిరాడు. పనెల రోజులు కాకముందే ప్రమా దం సంభవించి కన్నుమూయడంతో తోటి కార్మికులు.. కన్నీరుమున్నీరయ్యారు. నివాసాల మధ్యే .. పట్టణంలో 17 పాత సామాను గోదాములున్నాయి. పాత సామాను సేకరించిన వారు ఈ గోదాముల దగ్గరకు వచ్చి వీటి నిర్వాహకులకు అమ్ముతారు. ఇనుము, ప్లాస్టిక్, గాజు, పాలిథిన్‌తో పాటు పలు రకాలవి ఈ గోదాముల్లో రోజుల తరబడి ఉంటాయి. పెద్దపెద్ద ప్లాస్టిక్ డబ్బాలను చిన్న కట్టర్ మిషన్లతో కోయించి ముక్కలు ముక్కలుగా చేయిస్తారు. వీటిని మళ్లీ బస్తాలో నింపి హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ మిక్సింగ్ ప్లాంట్లకు తరలిస్తారు. జిల్లా కేంద్రంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. పెద్ద గోదాములను అద్దెకు తీసుకొని ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని పట్టణానికి సమీపంలో ఉంటే మరికొన్నిజనావాసాల మధ్యే ఉన్నాయి. జీవీవీ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన పేలుడు చుట్టుపక్కల నివాస ప్రాంతాలు లేవు. అయినా భారీ పేలుడు జరగడంతో శబ్దం కిలోమీటరు వరకు వెళ్లింది. రసాయన వాడకం చేసిన ఖాళీ డబ్బాలు కూడా భారీగా పాత సామాను గోదాములకు వస్తాయి. ఈ రసాయన డబ్బాలు మూత పెట్టినవి తీయడం ప్రమాదకరం కావడంతో పేలుడు సంభవిస్తున్నాయి. భయాందోళనలో ప్రజలు రోదిస్తున్న తోటి కార్మికులు వెంకటసాయి ప్లాస్టిక్ దుకా ణంలో సంభవించిన పేలుడుతో పేట ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యా రు. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ప్లాస్టిక్ దుకాణానికి సమీపంలోని భగత్‌సింగ్, తిరుమలానగర్, జమ్మిగడ్డ, ఖమ్మం క్రాస్‌రోడ్డు, విజయకాలనీ, మారుతినగర్, దాసాయిగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద బాంబు పేలుడు మాదిరిగా శబ్దం వచ్చిందంటూ ఒకరికొకరు చర్చించుకుంటుండగానే.. ప్లాస్టిక్ దుకాణంలో ఏదో పేలుడు సంభవించిందన్న వార్తలు దావానంలా వ్యాపించింది. అయితే దుకాణంలో మాత్రం కటింగ్ మిషన్ పేలితే ఇంత శబ్దం ఎలా వస్తుంది.. కాదు అది తప్పకుండా బాంబు పేలుడేనని ప్రజలు జోరుగా చర్చించుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ, డీఎస్పీ ఘటనాస్థలిని పరిశీలిస్తున్న ఏఎస్పీ, డీఎస్పీ వెంకటసాయి ప్లాస్టిక్ దుకాణంలో జరిగిన పేలుడు విషయాన్ని తెలుసుకున్న సూర్యాపేట ఏఎస్పీ పూజిత నీలం, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శివశంకర్‌లు ఘటనా స్థలా నికి చేరుకున్నారు. దుకాణంలోని పాత ఇనుము సామాగ్రితో పాటు సాహో కట్ చేసిన డబ్బాలను పరిశీలించారు. అయినా క్లూజ్ టీంను రప్పించి వివరాలు సేకరిస్తామని తెలిపారు. పేలుడు జరిగిన ఘట నను వెంటనే పోలీసులు క్లూజ్ టీంకు వివరించి రప్పించారు. దుకాణంలో రసాయనాల లేక.. మిషన్‌లో సాంకేతిక సమస్య.. ఎవరైనా వ్యక్తులు బాంబులు, జిలిటెన్‌స్టిక్స్ పెట్టారా అన్న కోణంలో క్లూజ్ టీం వివరాలు సేకరించారు. దీంతో ఘటన స్థలంలోని వివరాలను టీం సేకరించింది. క్షణాల్లో జరిగిపోయింది.. దుకాణంలో అందరం పనిలో నిమగ్నమైపోయాం. 20 మీటర్ల దూరంలో ఉండి ప్లాస్టిక్ డబ్బాలను వేరు చేసే పనిలో ఉన్నా. ఒక్కసారిగా పెద్దగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాకుండా.. భయాందోళనకు గురయ్యా. వెంటనే తేరుకుని చూడగా.. పక్కనే పనిచేస్తున్న సాహో విగతజీవిగా మారిపోయాడు. – పద్మ, రాంకోటితండా, కార్మికురాలు మూడేళ్లుగా పనిచేస్తున్నా .. ప్లాస్టిక్ దుకాణంలో మూడేళ్లుగా పనిచేస్తున్నా. గతంలో ప్లాస్టిక్ డబ్బాలను కట్ చేసేం దుకు ఇద్దరుముగ్గురు పనిచేసేవారు. కానీ ఏ రోజు కూడా డబ్బాలు కట్ చేస్తుండగా.. ప్రమాదం సంభవించలేదు. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఇప్పటికీ ఘటననుంచి తేరుకోలేకపోతున్నాం. – విజయ, కార్మికురాలు బాంబు పేలుడు కాదు పట్టణంలోని జాతీయ రహదారిలో జక్వీవీ ఫంక్షన్‌హాల్ వద్ద ఉన్న పాత సామాను గోదాములో ప్లాస్టిక్ టిన్లను చిన్ని ముక్కలుగా కట్ చేయడానికి మిషన్ఫై ప్రాసెస్చేస్తుండగా రసయనాలు వేడిమికి గురై పేలుడు జరిగింది. అంతే కాని ఇక్కడ ఎలాంటి బాంబు పేలుడు జరగలేదు. ప్రజలు ఇలాంటి రూమర్స్‌ను నమ్మవద్దు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్నాం. – రావిరాల వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ -
హైదరాబాద్ భోలక్‌పూర్‌లో అగ్నిప్రమాదం
-
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా పారిశ్రామికవాడలో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా గత నెలలో పలు ప్రభుత్వ కార్యాలయాలుండే సీజీఓ కాంప్లెక్స్‌లోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పండిట్ దీన్‌దయాళ్ అంత్యోదయ భవన్ ఐదో ఫ్లోర్లో మంటలు చెలరేగిన ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ ఉద్యోగి మరణించాడు. ఇక సీజీఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదానికి సరిగ్గా నెలరోజుల ముందు ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. -
బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని బోయిన్‌పల్లిలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ప్లాస్టిక్ పైపుల గోడౌన్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గోడౌన్‌లోని సామాన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. పొగలు తీవ్రంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. -
బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
-
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం..
-
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని మంగళ్‌హాట్ పరిధిలో ఓ ప్లాస్టిక్ గోదాములో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజమండ్రిలో తగలబడ్డ ప్లాస్టిక్ గౌడౌన్
-
మైలార్‌దేవ్‌పల్లి పాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలో మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లి నేతాజీనగర్‌లో సోమవారం ఉదయం ఓ ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
గోడౌన్లో మంటలు: నలుగురు సజీవ దహనం
చెన్నై: ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగి నలుగురు కార్మికులు సజీవ దహనమైన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ... భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సజీవ దహనమైన కార్మికులు గోడౌన్లో నిద్రిస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.