
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా పారిశ్రామికవాడలో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా గత నెలలో పలు ప్రభుత్వ కార్యాలయాలుండే సీజీఓ కాంప్లెక్స్‌లోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
పండిట్ దీన్‌దయాళ్ అంత్యోదయ భవన్ ఐదో ఫ్లోర్‌లో మంటలు చెలరేగిన ఘటనలో ఓ సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి మరణించాడు. ఇక సీజీఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదానికి సరిగ్గా నెలరోజుల ముందు ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment