న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుఝామున 2.18 గంటకు చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఐతే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలుకాలేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేయడంలో ఎరుపు రంగు రోబో కీలక పాత్ర పోషించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గత నెలలో రెండు రోబోలను ఆస్ట్రేలియా కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఆ రోబోలో ఒకటి ఈ రెడ్ రోబో. ఈ అగ్నిమాపక రోబోలను ఉపయోగించడం వల్ల త్వరిగతగతిన మంటలు అదుపులోకి తీసుకురాగలమని, సాధ్యమైనంత మేర తక్కువ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.
ఇవి సుమారు 100 మీటర్ల దూరం నుంచి కూడా మంటలను ఆర్పగలదు. ఇరుకైన మార్గంలో సంభవించిన ప్రమాదాల్లో సైతం ఈ రోబోలు చాలచక్కగా నావిగేట్ చేసి మంటలను ఆర్పేస్తాయని అంటున్నారు. ఇవి నిమిషానికి దాదాపు 2 వేల లీటర్లు చొప్పున నీటిని విడుదల చేయగలవు. ఇవి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎగిసి పడుతున్న అగ్నికీలల స్థాయిని బట్టి సామర్థ్యం మేర నీటిని విడుదల చేసేలా ప్రత్యేక విభాగం కూడా ఉంది. వీటికి సెన్సార్, కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. ఇవి నాలుగు కిలోమీటర్ల వేగంతో కదలగలవు.
Our government has procured remote-controlled fire fighting machines.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 20, 2022
Our brave fireman can now fight fires from a maximum safe distance of upto 100 meters.
This will help reduce collateral damage and save the precious lives. pic.twitter.com/1NjGX3ni3B
(చదవండి: షాకింగ్ ఘటన.. ఆమె చేతులు కట్టేసి భవనం పై నుంచి తోసేసి....: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment