ప్లాస్టిక్ మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చింది, దాని పర్యవసానాలు పట్టించు కోండి, ప్రకృతే దాని సంగతి చూసుకుంటుందని నిర్లక్ష్యంగా పారేయకుండా విలువగా వాడుకోండి. నాగరికతలు విఫలమైతే, ప్రకృతి వాటిని సరిదిద్దలేదు.
పర్యావరణ స్పృహగల ముంబై పౌరులు కేవలం వంద వారాంతపు రోజుల లోనే అక్కడి ఒక బీచ్ నుంచి 90 లక్షల కేజీల ప్లాస్టిక్‌ను సేకరించారు. పోటు మీదున్నప్పుడు సముద్రం లోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్ చెత్త ఇది. మునిసిపాలిటీ దాన్ని అక్కడి నుంచి తరలించి ఏ గోతుల్లోనో కప్పెట్టెయ్యలేనంత భారీ పరిమాణం ఇది. దీంతో నిరుత్సాహానికి గురైన పౌరులు ఇక మనం చేయగలిగేదేమీ లేదని ఆ పని ఆపేశారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకో వాల్సి వచ్చింది.
ఇది ముంబైలోని ఒక బీచ్ కథ మాత్రమే కాదు. నిరాటంకంగా సముద్రంలోకి గుమ్మరించిన ప్లాస్టిక్ దాదాపు ప్రతి బీచ్‌లోనూ ఇలా ఒడ్డుకు కొట్టుకు వస్తూనే ఉంటుంది. మందం ఎంతో ఇంకా కచ్చి తంగా లెక్కగట్టని ప్లాస్టిక్ ద్వీపాలు ప్రధాన సముద్రా లలో ఉన్నట్టు వివిధ కథనాలు తెలిపాయి. అవి ఒడ్డుకు కొట్టుకు రాని ప్లాస్టిక్ దీవులు. మానవ శరీ రాల్లోకి సైతం చొర బడగల స్థాయికి ఇప్పుడు ప్లాస్టిక్ శిథిలమ వుతోందని కనుగొన్నారు.
1950ల నుంచి ప్రపంచం 9 లక్షల కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసింది. ఇందులో 9 శాతాన్ని మాత్రమే రీసైకిల్ చేశారు. అంటే ఇంత భారీగా ఉత్ప త్తయిన ప్లాస్టిక్ ఉపయోగంలో ఉన్నది లేక కాస్త ముందు వెనుకలుగా చెత్తగా పారేయాల్సినది, లేక కప్పేసిన గోతుల్లో ఉన్నది. లేదంటే కాలువలు, నదులు, సముద్రాలలో లేదా ముళ్ల పొదలకు గుచ్చు కునో ఉంటుంది. ఇది, స్వీయ పరాజయంలో మాన వులు సాధించిన ఘనత. భూగోళపు జీవితంలోని ఆంత్రోప్రోసిన్ (ప్రకృతిని మానవులు ప్రభావితం చేసే) శకంలో మానవులు చేజేతులా ప్రపంచాన్ని నాశనం చేసుకునే ప్రధాన దశ ఇది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తయారైన 9 లక్షల కోట్ల టన్నుల భారీ ప్లాస్టిక్‌లోంచి దాదాపు 100 వారాల్లో ఒకే ఒక్క చిన్న బీచ్‌లోనే తొంబై లక్షల కేజీల ప్లాస్టిక్ బయటపడింది. ఆట వస్తువుల నుంచి పారి శ్రామిక వస్తువులు, పాల సంచుల వరకు అన్నిటికీ ప్లాస్టిక్‌నే వాడేలా యుద్ధానంతర కాలంలో మన ప్రవర్తన మారిపోయింది. చిన్న కొత్తిమీర కట్టకు కూడా ప్లాస్టిక్ సంచిని స్వీకరిస్తున్నాం. దీని పర్యవ సానాలేమిటో ప్రపంచం అర్థం చేసుకోవడం ఇప్పుడే మొదలై ఉండవచ్చు. బయటపడటం సులువేమీ కాని పరిస్థితిలో మనంతట మనమే ఇరుక్కున్నట్టున్నాం. ఈ నేపథ్యం నుంచి చూస్తే, 2018 మధ్యకల్లా ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం పథకం ఆహ్వానించదగినది. కానీ ఆ లక్ష్యాన్ని సాధించడం కష్టం కావచ్చు. ప్లాస్టిక్ సంచుల తయారీ, పంపిణీలోనే పెను మార్పు రావడం అందుకు అవసరం. సార్వత్రికంగా అంతా ప్లాస్టిక్‌కు బాగా అలవాటుపడిపోయిన మనుషులు తమ అల వాట్లను మార్చుకోవాలని ఆశించడం కష్టమే. పాకె ట్లకు బదులుగా పాలను సీసాల్లో పంపిణీ చేయవచ్చా వంటి సమంజసమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని శుభ్రం చేసి తిరిగి ఉపయోగించడానికి చాలా నీరు అవసరం అవుతుంది. తాగడానికి, సాగుకే నీరు అవసరంగా ఉంది.
కొత్త ప్లాస్టిక్‌ను వాడకుండా ఉండాలంటే మన జీవితాలనే పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుంది. గుడ్డ బ్యాగులు పట్టుకుని మార్కెట్‌కు వెళ్లడం, ప్లాస్టిక్ సీసాల్లోని నీటిని తాగడానికి నిరాక రించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ బాటిల్ నీరే పరిశుభ్రమైనదని విశ్వసించే స్థితికి మనం చేరాం. పౌర సంస్థ సరఫరా చేసే నీటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అది మరింత విద్యుత్ వినియోగంతో కూడినది, మన కర్బన వినియోగాన్ని పెంచేది. మనం కొనే ప్రతి వస్తువూ ప్లాస్టిక్‌తో చుట్టి నదే, రోడ్డు పక్క చాయ్ వాలా ఇచ్చే టీ కూడా వాడి పారేసే ప్లాస్టిక్ కప్పులోనే.
పునర్వినియోగానికి పనికిరాని, లేదా రీసైకిల్ చేయడం కష్టమయ్యే ప్లాస్టిక్ సంచులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ఉంది. చెత్త ఏరుకునే వారు సైతం వాటిని పనికిరానివిగానే చూస్తారు. నిషేధం విధిస్తే పౌరులు తమంతట తామే దాన్ని పాటిస్తారని అధికారులు విశ్వసించారు. అదేసమయంలో కారణాలేవైనా వాటి ఉత్పత్తి మాత్రం నిలిచిపోలేదు. మురికివాడల్లోని కార్ఖానాల్లో సైతం అవి తయారవుతున్నాయి. మనం అంతా పెరగనిచ్చిన విపత్తు ఇది.
బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ఒక సంపా దకీయంలో ‘‘అసలు సమస్య ప్లాస్టిక్ కాదు, మనమే. ఆ అద్భుతమైన పదార్థాన్ని మనం తిరస్కరించలేం. దాన్ని చెత్తగా చూడటానికి బదులు అపురూపమైనదిగా వ్యవహరిస్తుంటాం’’ అని పేర్కొంది. అంటే, ప్లాస్టిక్‌ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అది మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చిందనే దానితో సహా పట్టించుకుని, ప్రకృతే దాని సంగతి చూసు కుంటుందని నిర్లక్ష్యంగా పారేయకుండా విలువగా వాడుకోండి. నాగరికతలు విఫలమైతే, ప్రకృతి వాటిని సరిదిద్దలేదు.
- మహేశ్ విజాపుర్కర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment