రైజింగ్ కెరీర్.. క్లౌడ్ కంప్యూటింగ్
కెరీర్ అప్‌డేట్స్
ఏటా అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా విస్తరిస్తూ.. యువతకు అపార అవకాశాలకు వేదికగా నిలుస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ కెరీర్ అవకాశాలపై విశ్లేషణ..
యూజర్ సంస్థ ఎలాంటిదైనా.. సేవలు ఎలాంటివైనా అంతా ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో అందించే విధానం తెరపైకి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారానే సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ రూపకల్పన, డేటా మేనేజ్‌మెంట్ వంటి విధానాలు అమలవుతున్నాతయి. తమ ప్రొడక్ట్.. యూజర్స్‌కు నిమిషాల్లో సేవలను షురూ చేస్తున్నాయి. ఇలాంటి ఆధునిక విధానాలను సాధ్యం చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానమే క్లౌడ్ కంప్యూటింగ్.
కెరీర్ ఆపర్చునిటీస్
క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సంస్థల కోణంలో అత్యంత ఆదరణ పొందుతోంది. క్లౌడ్ టెక్నాలజీస్‌ను సమర్థంగా నిర్వహించేందుకు నిపుణులైన మానవ వనరుల అవసరం శరవేగంగా పెరుగుతోంది. ఏటా లక్షల్లో అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి కెరీర్ ఆపర్చునిటీస్ అధికంగా ఉన్న విభాగాలు.. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజర్, క్లౌడ్ బిజినెస్ అనలిస్ట్, క్లౌడ్ నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్, క్లౌడ్ ప్రొడక్ట్ మేనేజర్, క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్
స్పెషల్ సర్టిఫికేషన్స్
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలే ఈ విభాగంలో నైపుణ్యం అందించేలా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. అవి.. ఐబీఎం సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ నాలెడ్జ్, ఈఎంసీ క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఈఎంసీ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్ వంటివి.
PaaS (ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్)
ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌కు సంబంధించి హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సంబంధిత అంశాలు, అప్లికేషన్స్‌ను సదరు ప్రొడక్ట్ డెవలపర్ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు అవసరమైన టెక్నాలజీని అందించే విభాగం ఇది.
IaaS (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్)
క్లౌడ్ కంప్యూటింగ్‌ను వినియోగిస్తూ ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌కు సంబంధించి మౌలిక వనరులను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే విధానం ఐఏఏఎస్.
SaaS (సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్)
ఒక నిర్దిష్ట సేవను నిర్ణీత సమయంలో తమ అవసరం మేరకు ఇంటర్నెట్ ద్వారా వినియో గించుకునే అవకాశం కల్పించే విధానం సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్.
ఆకర్షణీయ వేతనాలు
ఎంట్రీ లెవల్ ఉద్యోగాలుగా పేర్కొనే క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్‌కు కనీసం రూ. 5 లక్షల వార్షిక వేతనం ఖరారవుతోంది.
అవసరమైన అర్హతలు
క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ఐటీ, సీఎస్‌ఈ, ఈసీఈ నేపథ్యం ఉన్నవారికి సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. వీటికి అదనంగా యూజర్ సపోర్టింగ్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి నైపుణ్యాలుంటే అవకాశాలు మెరుగవుతాయి.
క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్
గోల్డ్‌మన్ శాచ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే ప్రకారం- మ్యాన్ పవర్ డిమాండ్ 1:100 గా ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే ప్రకారం 2016లో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో 2.2 మిలియన్ ఉద్యోగావకాశాలు. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2012తో పోల్చితే 2016 చివరికి క్లౌడ్ సెక్టార్ 400 శాతం పెరగనుంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన మేఘ్‌రాజ్ పథకంతో ప్రభుత్వ విభాగాలన్నిటిలోనూ క్లౌడ్ ఆధారిత సేవలు, అంతే స్థాయిలో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది.
క్లౌడ్ ఆర్కిటెక్ట్స్
క్లౌడ్ కంప్యూటింగ్ సెగ్మెంట్‌లో అన్ని విభాగాల్లో, హోదాల్లో మానవ వనరులకు మంచి డిమాండ్ నెలకొంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రొఫైల్ సంస్థల కోణంలో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది.
- ఎస్. సుమన్, క్లౌడ్ అండ్ కన్వర్జ్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడ్, మూడీస్ కార్పొరేషన్