Cloud Technologies
-
టెక్ మహీంద్రా నుంచి క్లౌడ్ బ్లేజ్‌టెక్ ప్లాట్‌ఫాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా క్లౌడ్ బ్లేజ్‌టెక్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. కంపెనీలు వేగవంతంగా డిజిటల్ వైపు మళ్లేందుకు ఇది సహాయకరంగా ఉండగలదని సంస్థ చీఫ్ డెలివరీ ఆఫీసర్ సుధీర్ నాయర్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫాంతో 25-30 శాతం మేర వ్యయాలు ఆదా కాగలవని, క్లౌడ్‌కు మైగ్రేట్ అయ్యేందుకు పట్టే సమయం కూడా 30 శాతం తగ్గుతుందని వివరించారు. టెలికం, ఆటోమొబైల్ తదితర రంగాలకు అవసరమైన క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్‌ను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. -
వణికిస్తున్న ఆర్ధిక మాంద్యం..మరో బిజినెస్‌ను మూసేసిన స్విగ్గీ
జనాలా చేత డబ్బులు ఖర్చు పెట్టిచ్చే బిజినెస్ చేస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ..రెసిషన్ ముంచుకొస్తోంది. డబ్బులు ఆదా చేసుకోండని సలహా ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ బెజోస్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే? ఆయన చేసేది కూడా వ్యాపారమే. కానీ వ్యాపార వేత్తలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్ధిక మాంద్యం దెబ్బకు క్లౌడ్ కిచెన్ బ్రాండ్ ది బౌల్ కంపెనీని షట్ డౌన్ చేసింది.ఎందుకంటే? ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా తన మేజర్ బిజినెస్ ఫుడ్ అండ్ గ్రాసరీ విభాగంలో నష్టాలు పెరుగుతున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకంటూ, ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకక తప్పలేదని చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. స్విగ్గీ మాత్రం క్లౌడ్ కిచెన్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఊహించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు.కాబట్టే ఢిల్లీ - ఎన్సీఆర్లలో మాత్రమే ఈ బిజినెస్‌ను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక బెంగళూరు, చెన్నై,హైదరాబాద్ వంటి నగరాల్లో ది బౌల్ కంపెనీని పెట్టుబడులు పెట్టడం,అభివృద్ధి చేయడాన్ని కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. బౌల్ కంపెనీతో పాటు, స్విగ్గి బ్రేక్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హోమ్లీ వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది. ఈ విభాగాల్లో స్విగ్గీ గణనీయమైన లాభాల్ని గడిస్తున్నట్లు తేలింది. గత వారం, కంపెనీలో 33 శాతం వాటాను కలిగి ఉన్న స్విగ్గీ ఇన్వెస్టర్ ‘ప్రోసస్’ 2022 మొదటి 6 నెలల కాలంలో అమ్మకాలు, గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) పరంగా సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించిందని చెప్పింది. ప్రోసస్ నివేదిక ప్రకారం.. సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఫుడ్ డెలివరీ వ్యాపారం 38 శాతం, జీఎంవీ విలువ 40 శాతం పెరిగింది. క్లౌడ్ కిచెన్ అంటే బ్యాచిలర్లు, కాలేజీ స్టూడెండ్స్, వ్యాపారాలతో తీరికలేని వాళ్లు స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్..లాంటి యాప్స్‌లో ఆర్డర్ పెట్టుకొని నచ్చిన రుచులను ఇంటికే తెప్పించుకుని ఆరగిస్తుంటారు. ఫుడ్ బాగుంటే ప్రతి సారి ఆ హోటల్ నుంచి తెప్పించుకొని తినడమే, లేదంటే వీలైనప్పుడు నేరుగా వెళ్లి తిని వస్తుంటారు. కానీ ఈ క్లౌడ్ కిచెన్ విభాగంలో అలా తినేందుకు వీలుపడదు. పైన మనం చెప్పుకున్నట్లుగా స్విగ్గీ ది బౌల్‌లాంటి క్లౌడ్ కిచెన్ సంస్థలు దేశంలోని ఆయా ప్రాంతాల్లో వంట చేసేలా పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్‌లూ, ఫ్రిజ్‌లూ, ఓవెన్లూ, స్టోర్ రూమ్లూ, వంటసామానూ ఇలా అన్నీ అందుబాటులో ఉండేలా ఈ క్లౌడ్ కిచెన్లను అద్దెకు తీసుకుంటాయి. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్‌ను అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తుంటాయి. దీన్నే క్లౌడ్ కిచెన్ అంటారు. ఒక్క ముక్కలో చెప్పలాంటే మీకు కావాల్సిన ఆహార పదార్ధాలన్నీ దొరుకుతాయి. కానీ రెస్టారెంట్ల తరహాలో కూర్చొని తినేందుకు వీలుండదు. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
ఎస్ఎంఎస్లను స్మార్ట్‌గా దాచుకోండి..
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : మొబైల్ మన వెంట ఉంటే ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక చాలా పనులు దానితోనే కానిచ్చేస్తున్నారు. వివిధ పనుల షెడ్యూల్, రిమైండర్, అనుకున్న సమయానికి మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకోవడం, టైం చూసుకోవడం, అలారం ఇలా ఒకటేమిటీ చాలా రకాల పనులను ఇట్టే చేసుకునే వీలు కలిగింది. అలాగే మనకు ప్రతి రోజు ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఇందులో ముఖ్యమైనవి ఉంటాయి. వాటిని దాచుకోవడానికి, అనుకోకుండా మనకు కావాల్సి ఎస్ఎంఎస్లు డిలీట్ అయితే వాటిని తిరిగి బ్యాకప్ చేసుకోవడం వంటివి చాలా మందికి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ప్రత్యేకమైన యాప్‌ల ద్వారా డెలిట్ అయిన మన ఫోన్ నంబర్లు, ఎస్ఎంఎస్లను తిరిగి పొందవచ్చు. కాంటాక్టు నంబర్లు, ఎస్ఎంఎస్, ముఖ్యమైన సమాచారం గుట్టుగా భద్రపరుకోవడం కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో వందలాది అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి రేటింగ్ ఉన్న యాప్‌ల గురించి తెలుసుకుందాం... ఎస్ఎంఎస్ల బ్యాకప్ ఇలా... సాధారణంగా మనకు రోజుకు ఎన్నో టెక్ట్స్స్ మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని రహస్యంగా స్టోర్ చేసి పెట్టుకోవాలనుకున్నా..ఫోన్ దెబ్బతిన్న సందర్భాల్లో అవసరమైన మెసెజ్‌లు పోగొట్టుకోకుండా ఉండాలన్నా తోడ్పడే కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్లౌడ్ స్టోరేజీలో, ఫోన్, మెమోరీ కార్డుల్లో ఎస్ఎంఎస్ డాటా స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. మరికొన్నింటిలో అయితే నిర్ణిత సమయంలో మన ఎస్ఎంఎస్లను మన ఈ మెయిల్‌ను పంపిస్తాయి.మెయిల్ ఓపెన్ చేసుకుని వాటిని చూసుకోవచ్చు.రోజు,రెండు రోజులకోసారి,వారానికి ఒకసారి ఎలాగైనా మన బ్యాకప్ సెట్ చేసుకోవచ్చు. కొన్ని ఎస్ఎంఎస్ బ్యాకప్‌లలో కాల్ వివరాలు బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంది. రేటింగ్ యాప్‌లు... ఎస్ఎంఎస్ బ్యాకప్ ప్లేస్, ఎస్ఎంఎస్ బ్యాకప్ రీస్టోర్, సీఎం బ్యాకప్, ఈజీ బ్యాకప్ అండ్ రీస్టీర్, సూపర్ బ్యాకప్, ఎస్ఎంఎస్ అండ్ కాల్ లాగ్ బ్యాకప్ మొదలైన యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ఎస్ఎంఎస్ బాక్స్ యాప్... ఇందులో బ్యాకప్‌తో పాటు మరో అద్బుతమైన ఫీచర్ ఉంది. దీనిలో ఏవైనా కొన్ని కాంటాక్ట్‌లు జత చేసుకోవచ్చు. దానితో ఆ కాంటాక్ట్ నెంబర్ల నుంచి ఎస్ఎంఎస్లు ఫోన్ ఇన్‌బాక్స్‌లో కనిపించవు. వేరుగా ప్రైవేట్ ఎస్ఎంఎస్ బాక్స్ యాప్ ఓపెన్ చేసుకుని అందులో చూడవచ్చు. ఈ యాప్‌కు పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్ఎంఎస్ టూ టెక్టస్ యాప్... దీనిలో మరో అదనపు సౌకర్యం ఉంది. ఈ యాప్ ద్వారా మన ఇన్‌బాక్స్‌లోని ఎస్ఎంఎస్లు అన్నింటినీ టెక్టŠస్ ఫైల్ రూపంలో పొందవచ్చు. అంటే ఆ ఫైల్ మరో ఫోన్లో అయినా కంప్యూటర్లో అయినా ఓపెన్ చేసి చూసుకోవచ్చు.కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. వందల రకాల యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. మన అవసరానికి అనుగుణంగా ఉండే యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటే మంచింది. -
రైజింగ్ కెరీర్.. క్లౌడ్ కంప్యూటింగ్
కెరీర్ అప్డేట్స్ ఏటా అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా విస్తరిస్తూ.. యువతకు అపార అవకాశాలకు వేదికగా నిలుస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. యూజర్ సంస్థ ఎలాంటిదైనా.. సేవలు ఎలాంటివైనా అంతా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో అందించే విధానం తెరపైకి వచ్చింది. ఆన్లైన్ ద్వారానే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ రూపకల్పన, డేటా మేనేజ్మెంట్ వంటి విధానాలు అమలవుతున్నాతయి. తమ ప్రొడక్ట్.. యూజర్స్‌కు నిమిషాల్లో సేవలను షురూ చేస్తున్నాయి. ఇలాంటి ఆధునిక విధానాలను సాధ్యం చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానమే క్లౌడ్ కంప్యూటింగ్. కెరీర్ ఆపర్చునిటీస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల కోణంలో అత్యంత ఆదరణ పొందుతోంది. క్లౌడ్ టెక్నాలజీస్‌ను సమర్థంగా నిర్వహించేందుకు నిపుణులైన మానవ వనరుల అవసరం శరవేగంగా పెరుగుతోంది. ఏటా లక్షల్లో అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి కెరీర్ ఆపర్చునిటీస్ అధికంగా ఉన్న విభాగాలు.. క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజర్, క్లౌడ్ బిజినెస్ అనలిస్ట్, క్లౌడ్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్, క్లౌడ్ ప్రొడక్ట్ మేనేజర్, క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్ స్పెషల్ సర్టిఫికేషన్స్ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలే ఈ విభాగంలో నైపుణ్యం అందించేలా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. అవి.. ఐబీఎం సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ నాలెడ్జ్, ఈఎంసీ క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఈఎంసీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్ వంటివి. PaaS (ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్‌కు సంబంధించి హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్ సంబంధిత అంశాలు, అప్లికేషన్స్‌ను సదరు ప్రొడక్ట్ డెవలపర్ ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు అవసరమైన టెక్నాలజీని అందించే విభాగం ఇది. IaaS (ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్) క్లౌడ్ కంప్యూటింగ్‌ను వినియోగిస్తూ ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్‌కు సంబంధించి మౌలిక వనరులను ఆన్లైన్ విధానంలో నిర్వహించే విధానం ఐఏఏఎస్. SaaS (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) ఒక నిర్దిష్ట సేవను నిర్ణీత సమయంలో తమ అవసరం మేరకు ఇంటర్నెట్ ద్వారా వినియో గించుకునే అవకాశం కల్పించే విధానం సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఆకర్షణీయ వేతనాలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలుగా పేర్కొనే క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్‌కు కనీసం రూ. 5 లక్షల వార్షిక వేతనం ఖరారవుతోంది. అవసరమైన అర్హతలు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ఐటీ, సీఎస్ఈ, ఈసీఈ నేపథ్యం ఉన్నవారికి సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. వీటికి అదనంగా యూజర్ సపోర్టింగ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి నైపుణ్యాలుంటే అవకాశాలు మెరుగవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ గోల్డ్‌మన్ శాచ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే ప్రకారం- మ్యాన్ పవర్ డిమాండ్ 1:100 గా ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే ప్రకారం 2016లో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో 2.2 మిలియన్ ఉద్యోగావకాశాలు. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2012తో పోల్చితే 2016 చివరికి క్లౌడ్ సెక్టార్ 400 శాతం పెరగనుంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన మేఘ్రాజ్ పథకంతో ప్రభుత్వ విభాగాలన్నిటిలోనూ క్లౌడ్ ఆధారిత సేవలు, అంతే స్థాయిలో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సెగ్మెంట్లో అన్ని విభాగాల్లో, హోదాల్లో మానవ వనరులకు మంచి డిమాండ్ నెలకొంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రొఫైల్ సంస్థల కోణంలో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. - ఎస్. సుమన్, క్లౌడ్ అండ్ కన్వర్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడ్, మూడీస్ కార్పొరేషన్