శ్రీశైలంలో ప్లాస్టిక్‌ బియ్యం ?· | plastic rice in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో ప్లాస్టిక్‌ బియ్యం ?·

Published Sun, Jun 4 2017 10:07 PM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

శ్రీశైలంలో ప్లాస్టిక్‌ బియ్యం ?· - Sakshi

శ్రీశైలంలో ప్లాస్టిక్‌ బియ్యం ?·

-  అనుమానంతో కిరాణం షాపుల్లో  పోలీసుల తనిఖీలు
 
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని కొన్ని దుకాణాల్లో ప్లాస్టిక్‌ బియ్యాన్ని అమ్ముతున్నారని కొందరు ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌ తన సిబ్బందితో ఆదివారం సాయంత్రం తనిఖీలు చేశారు. స్థానిక మల్లికార్జునసదన్‌లోని ఒక దుకాణంలో కొన్న బియ్యం తినడం వల్ల  అనారోగ్యం కలిగిందని స్థానిక వినియోగదారుడు ఒకరు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ తెలిపారు. దీంతో ఆ దుకాణంలో తనిఖీలు చేశామని, అయితే అప్పటికే వారి వద్ద ఉన్న బియ్యం బస్తాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నిర్ణారణ కోసం బియ్యాన్ని కాల్చి చూశామని తెలిపారు. ఫిర్యాదు దారుడు తెచ్చిన వండిన అన్నాన్ని కూడా పరిశీలించామని, అవి పంపిణీ చేసిన డీలర్‌ను సోమవారం పిలిపించి విచారణ చేస్తామని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement