బయటి కన్నా ఇంట్లోని కాలుష్యంతోనే అధిక ముప్పు | Pollution in The Home is More Dangerous Than Outside | Sakshi
Sakshi News home page

Pollution: బయటి కన్నా ఇంట్లోని కాలుష్యంతోనే అధిక ముప్పు

Published Wed, Oct 13 2021 1:20 PM | Last Updated on Wed, Oct 13 2021 2:16 PM

Pollution in The Home is More Dangerous Than Outside - Sakshi

కర్నూలు(సెంట్రల్‌) : బయట వాహనాల పొగ, దుమ్ము, ధూళితో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. దాన్నుంచి బయట పడడానికి ముఖానికి మాస్క్‌లు, చున్నీలు, రుమాళ్లు కట్టుకుంటాం. ఆయా కారకాల నుంచి అవి కాస్తంత ఉపశమనం కలిగిస్తాయి. ఇంట్లో కాలుష్యం ఉంటే ఎలా? మనం వాడే కొన్ని వస్తువుల వల్ల గృహాల్లోని గాలి కలుషితమవుతోంది మరి...

ఇంట్లోని కాలుష్యం బయటి దానికన్నా ప్రమాదకరం.రోజు వాడే పదార్ధాలు, వస్తువులు, నిత్య అలవాట్లు వల్ల కాలుష్య కారకాలు విడదలవుతున్నాయి. రంగులు, వంటగ్యాస్, పెంపుడు జంతవుల వచ్చే అలర్జీలు, ఇంట్లోని కార్పెట్లు, ప్లాస్టిక్‌ వస్తువులు వంటివి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదక ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మనదేశానికి చెందినవి 14  ఉన్నాయి. 

ఈ నగరాల్లో పీఎం2  కాలుష్య కారకంఎక్కుగా విడుదలవుతోంది. అంతర్గత వాతావరణ కాలుష్యాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏడాదీ లక్షలాదిమంది మృతి చెందుతున్నారు. కాలుష్యం వల్ల శరీరంలోని చాలా భాగాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడుతోంది. ఫలితంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా, వంట రుగ్మతలు వస్తాయి. వాతావరణ కాలుష్య కారకాలలను నియంత్రించచడం ఒక్కరి వల్ల అయ్యేపనికాదు. 

అయితే ఇంట్లో ఉన్న కాలుష్య కారకాలను నియంత్రించుకోవడం మనకు సాధ్యమే. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి బయటపడవచ్చు. కొత్తగా చేసుకున్న అలవాట్లతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. గతంలో ప్లాస్టిక్‌ వాడకంలేదు. ఇప్పుడు అది లేనిదే రోజు గడవదు. రంగులు, కార్పెట్లు ఇలా కొన్ని వస్తువులు ఇటీవలి జీవన పద్ధతులు ఇంట్లోకి చేరాయి. వీటిని దూరంగా ఉంచితే కాలుష్య నుంచి దూరంగా ఉన్నట్లే అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా...

పచ్చదనానికి అలవాటు పడాలి..
వాతావరణం, ఇంట్లోని కాలుష్యాన్ని తగ్గించే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొక్కలు. స్వస్ఛమైన గాలిని, ఆక్సిజన్‌ను అందిస్తాయి. అవి ఇంట్లో ఉంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కుండీల్లో పెంచే చిన్నచిన్న మొక్కలు , డ్వార్ఫ్‌ మొక్కలను ఇంటి లోపల పెంచుకోవాలి. దీనివల్ల ఇంటికి పచ్చదనం, ఆరోగ్యం రెండూ సమకూరతాయి. 

వెంటిలేషన్‌ ముఖ్యం...
ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూడడం వల్ల చాలా ఇబ్బందులు తగ్గుతాయి. దీని వల్ల నివాసాల్లోని చెడువాసన చక్కగా బయటకు వెళుతుంది. లోపల ఉన్న దుమ్ము, అలర్జీని కలిగించే కారకాలు గాలి లోపలికి బాగా వీయడంతో బయటకు వెళ్లిపోతాయి. ఇంట్లోకి వచ్చే సూర్యకిరణాలు సూక్ష్మ జీవులను సంహరిస్తాయి. వెంటిలేషన్‌ వల్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

కార్పెట్లతో మరింత కాలుష్యం...
ఇంట్లో వాడే కార్పెట్లు కాలుష్యకారకాలను పట్టి ఉంచుతాయి. కార్పెట్లలో పెంపుడు జంతువుల వెంట్రుకలు, దుమ్మ, ధూళి కణాలు చేరతాయి. వాటిని వ్యాక్యూమ్‌ క్లీనర్లతో శుభ్రం చేసేటప్పుడూఅయా కారకాలు ఇంట్లోని వాతావరణంలో చేరి వ్యాధులను కలగిస్తాయి. చిన్నపిల్లలు వీటిపై తిరిగితే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

ప్లాస్టిక్‌కి దూరంగా...
ఆధునిక జీవన శైలితో ప్లాస్టిక్‌ ఇంట్లో భాగమైపోయింది. వీటి నుంచి వెలువడే ఉప ఉత్పన్నాలు కాలుష్యాన్ని కలిగిస్తాయి. ప్లాస్టిక్‌ నుంచి వెలువడే మైక్రోప్లాస్టిక్స్‌ 0.1 ఎంఎం ఉంటాయి. సింథటిక్‌ కార్పొట్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు తదితరలతో ఇవి ఉత్పన్నమవుతాయి. అందువల్ల ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి.

ధూమపానం నిషిద్ధం..
ఇంట్లో పొగ తాగడం, వారికే కాకుండా మిగిలిన వారందరికీ హానికరం. ఈ విషయం అందరికీ తెలిసినా కొందరు పట్టించుకోరు. బయట తాగడం కన్నా ఇంట్లో ధూమపానం వల్ల ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. పొగ లోపలే ఉండిపోవడంతోమళ్లీ మళ్లీ పీల్చాల్సి వస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.

ఇవి వద్దే వద్దు...
ఇంట్లో మంచి సువాసన రావడానికి వెలిగించే సుగంధ పుల్లలు(ధూప్‌స్టిక్స్‌) వల్ల కాలుష కారకాలు విడుదలవుతాయి. అవి వెదజల్లే పొగలో వివిద రసాయనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల శ్వాస, చర్మ సమస్యలు వస్తాయి. 

ఇంట్లోని కాలుష్యం ప్రమాదకరం – అచ్యుతరామయ్య, పర్యావరణ శాస్త్రవేత్త
ఇంటిలోపలి కాలుష్యం ప్రమాదకరంమైంది. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు, జలుబు, దగ్గు, న్యుమోమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇంట్లోనే ఉంటుండడంతో వారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేవిధంగా చూసుకోవాలి. ఆధునిక పోకడలను తగ్గించుకుంటే అంతర కాలుష్యాన్ని తగ్గించవచ్చు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement