ప్రభుత్వ ఆఫీసుల్లో ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం | Goa to ban plastic items from government offices | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆఫీసుల్లో ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

Published Wed, Jun 24 2015 9:28 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

Goa to ban plastic items from government offices

పనాజీ: ప్లాస్టిక్ కప్లు, సంచులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు గోవా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక మీదట కనిపించవు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా నిషేధం. గోవా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

త్వరలోనే సర్క్యులర్ జారీ చేయనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గోవా గవర్నర్ మృదులా సిన్హా అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ మండలి సమావేశంలో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలన్న ప్రతిపాదన చేయగా.. ముఖ్యమంత్రి ఇందుకు అంగీకరించారు. ఈ వారంలోనే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తున్నట్టుగా సర్క్యులర్ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement