ప్లాస్టిక్ జాతీయ జెండాలను ఉపయోగించవద్దని పాఠశాలల విద్యా విభాగం జీవో జారీ చేసింది.
సాక్షి, ముంబై : ప్లాస్టిక్ జాతీయ జెండాలను ఉపయోగించవద్దని పాఠశాలల విద్యా విభాగం జీవో జారీ చేసింది. జనవరి 26, ఆగస్ట్ 15 తేదీల్లో చాలా మంది పాఠశాలల ఆవరణలో ప్లాస్టిక్ జెండాలను విక్రయిస్తూ ఉంటారు. అయితే వీటిని కొనుగోలు చేయవద్దని పాఠశాలలు విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యావిభాగం కోరింది.
జెండా వందన కార్యక్రమం ముగిసిన వెంటనే ఆ జెండాలను పిల్లలు ఎక్కడపడితే అక్కడ పడేసే అవకాశం ఉందని, అది మన జాతీయ జెండాకే అవమానకరమని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో పాఠశాలల విద్యార్థులు కేవలం కాగితంతో తయారు చేసిన జెండాలను మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం కూడా పాఠశాలలకు స్పష్టం చేయాలని తెలిపారు.