పార్వతీపురం పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ మంగళవారం విద్యార్థులు కదంతొక్కారు.
పార్వతీపురం(విజయనగరం జిల్లా): పార్వతీపురం పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ మంగళవారం విద్యార్థులు కదంతొక్కారు. పట్టణంలో వీధి వీధి తిరుగుతూ ప్లాస్టిక్ వాడొద్దు అంటూ ఇంటింటా ప్రచారం చేశారు.
ఈ ప్రచారంలో సాయిరాం, గాయత్రి డిగ్రీ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో పాటు జట్టు అనాథాశ్రమం నిర్వాహకులు పద్మజ, ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.