చెన్నై: పాంబన్ సముద్రతీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం మృతదేహాన్ని కోసి చూసిన జాలర్లు దాని పొట్టలో కనిపించిన వస్తువును చూసి ఆశ్చర్యపోయారు. రామేశ్వరం సమీపంలోని సముద్ర తీరంలో గురువారం సాయంత్రం 18 అడుగుల నాలుగు టన్నుల బరువు గల భారీ తిమింగలం మృతి చెంది ఒడ్డుకు చేరింది. దానిని కోసి అటవీ శాఖ, వెటర్నటీ వైద్యులు పరీక్షలు జరిపారు. పొట్టలో పేగుల మధ్య ప్లాస్టిక్ స్పూన్ ఇరుక్కుంది. ఈ కారణంగానే తిమింగలం మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
అనంతరం దాన్ని జేసీబీతో సముద్ర తీరంలో పెద్ద గుంత తవ్వి పూడ్చిపెట్టారు. ముఖ్యంగా సముద్రంలో చేపలు పట్టే జాలర్లు ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లే భోజన పదార్థాలు తిని, అనంతరం వాటిని సముద్రంలోకి విసిరి వేస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ కూల్ డ్రింక్స్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు వంటివి విసిరివేయడం చేస్తున్నారు. వాటిని ఆహారంగా తీసుకున్న సముద్ర చరాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు, వాటిని తినే ప్రజలకు పలు రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను సముద్రంలోకి విసర వద్దని జాలర్లకు వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తిమింగలాన్ని చంపిన ప్లాస్టిక్ స్పూన్..
Published Fri, Aug 11 2017 6:41 PM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM
Advertisement
Advertisement