
కాటేదాన్‌లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
హైదరాబాద్: కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలోని తాతానగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు భారీగా ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.